వలసదారుల విధానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయానికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.ఏదైనా దేశస్థుడు అమెరికాకు వచ్చిన 30 రోజుల్లోపు తనకు ఆరోగ్య బీమా ఉందని నిరూపించుకోవాలని లేని పక్షంలో కొత్త హెల్త్ ఇన్స్‌రెన్సూ పాలసీని తీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
ఈ నిబంధనను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఒరెగాన్‌లోని జిల్లా జడ్జి మైఖేల్ సైమన్ ఉత్తర్వులు జారీ చేశారు.
హెల్త్‌కేర్ నిబంధనను సవాల్ చేస్తూ ఏడుగురు అమెరికన్ పౌరులు ఒక ఎన్జీవో కోర్టులో దావా వేశారు.
ఇది వేలాది మంది చట్టబద్ధమైన వలసదారులకు ప్రతిబంధకంగా మారడంతో పాటు ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలతో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకి వస్తున్న వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గేందుకు దోహదం చేస్తుందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.విచారణ సందర్భంగా జడ్జి సైమన్ మాట్లాడుతూ.
ఈ నిబంధన అమెరికా వ్యాప్తంగా కుటుంబాలకు నష్టం కలిగిస్తున్నందున నిషేధం ఆమోద యోగ్యమైనదేనన్నారు.

కాగా.అమెరికాలో హెల్త్‌కేర్ సిస్టమ్ సంక్లిష్టమైనది, అలాగే అవసరమైన భీమా కవరేజీని ఎలా పొందాలో తెలియక వలసదారుల అవస్థలు వర్ణనాతీతం.కుటుంబ కేందీకృత ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధ నుంచి అమెరికాను బయటపడేసేందుకే ట్రంప్ ఈ నిబంధన ప్రతిపాదించారు.
ఈ హెల్త్‌కేర్ పాలసీపై 28 రోజుల తాత్కాలిక స్టేను విధిస్తూ న్యాయమూర్తి సైమన్ ఆదేశాలు జారీ చేశారు.ఈ నిషేధం నవంబర్ 3 నుంచి అమల్లోకి వస్తుంది.
కాగా అమెరికన్ పౌరుల కంటే వలసదారులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధను ఉపయోగించుకునే అవకాశం తక్కువగా ఉందని యూఎస్ నిపుణులు చెబుతున్నారు.జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో 2017లో భీమా లేని వలసదారులు.
అమెరికా వైద్య రుసుములో పదవ వంతు కంటే తక్కువ ఉన్నారని తెలిపింది.







