గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతివేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల్ కొలనూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుపుకున్నారు.

దీనిలో భాగంగా గౌడ పెద్దలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న చేసిన విప్లవ పోరాటం గురించి స్మరించుకున్నారు.

అలాగే వారు మాట్లాడుతూ ఒక సామాన్యుడి స్వప్నం ఒక యొదుడి ఆశయం ఒక బహుజన కెరటం,ప్రప్రధమంగా ఆయుధం పట్టిన విప్లవ తేజం.భారతదేశం సగర్వంగా గర్వించదగిన మట్టిమనిషి ఉక్కుమనిషి.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న ని ఆదర్శంగా తీసుకోవాలని అలాగే గౌడ్ అన్నల ఐక్యత గా ఉండాలని వారు కోరారు.

సర్ధార్ సర్వయి పాపన్న జయంతి ఉత్సవాలు మన గౌడ సోదరులు ప్రతి ఊరిలో జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌడ సోదరులు పాల్గొన్నారు.

Advertisement
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News