పరాయి దేశంలో మెరుగైన జీవితం, డబ్బు సంపాదించాల భారతీయుల ఆశ .కొన్ని ముఠాలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
చట్టప్రకారం అమెరికా, కెనడా, యూకే తదితర దేశాలకు వెళ్లడం కుదరని పక్షంలో దొడ్డిదారిన ఎంత ఖర్చయినా సరే వెళ్లేందుకు భారతీయులు వెనుకాడటం లేదు.ఈ క్రమంలో పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకుంటుండగా.
మరికొందరు జైళ్ల పాలవుతున్నారు.దీనికి మించి లక్షలాది రూపాయలను వదిలించుకుంటున్నారు.
తాజాగా ఓ వ్యాన్‌లో భారతీయులను అక్రమంగా రవాణా( smuggled Indian Migrants ) చేస్తూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులకు యూకే కోర్ట్( UK Court ) 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.యూకే హోం ఆఫీస్ ప్రకారం.
మంచార్ మియాన్ అట్టిక్యూ( Manzar Mian Attique ) అనే మారుపేరుతో పనిచేస్తున్న బ్రిటీష్ జాతీయులు షఫాజ్ ఖాన్,( Shafaz Khan ) చౌదరి రషీద్‌లు( Choudhry Rashied ) వలసదారులను దొడ్డిదారిన దేశంలోకి తీసుకొచ్చేందుకు చెత్త టైర్ల వెనుక వారిని దాచారు.యూకే ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు లండన్‌లోని ఐల్‌వర్త్ క్రౌన్ కోర్టు( Isleworth Crown Court ) వీరిద్దరికి వేర్వేరుగా 5 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించింది.
యూకే బోర్డర్ సెక్యూరిటీ శాఖ మంత్రి డేమ్ ఏంజెలా ఈగల్( Minister Dame Angela Eagle ) ఈ కేసుపై మాట్లాడుతూ.మానవ అక్రమ రవాణా ముఠాలు వారి ఆర్దిక లాభం కోసం ప్రజలను అసురక్షిత, చట్ట విరుద్ధమైన పరిస్ధితుల్లోకి నెట్టి దోపిడీ చేశారని మండిపడ్డారు.ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న క్రిమినల్ గ్యాంగ్‌లను అరికట్టడానికి తాము కొత్త బోర్డర్ సెక్యూరిటీ కమాండ్‌కు 150 మిలియన్ పౌండ్ల నిధులను కేటాయించినట్లు ఏంజెలా చెప్పారు.
హోం ఆఫీస్ దర్యాప్తులో నిందితులిద్దరూ సదరు వ్యాన్‌ను మానవ అక్రమ రవాణా కోసమే అద్దెకు తీసుకున్నారని తేలింది.తమ నేరం బయటపడకుండా ఉండేందుకు నిందితులిద్దరూ బర్నర్ ఫోన్‌లను ఉపయోగించారని.అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వీరిని గుర్తించినట్లు యూకే హోం ఆఫీస్ పేర్కొంది.
ఇంగ్లాండ్ దక్షిణ తీరంలోని న్యూహవెన్ ఫెర్రీ పోర్ట్ వద్ద యూకే బోర్డర్ ఫోర్స్ అధికారులు వారిని అడ్డుకోవడంతో గుట్టుపడినట్లుగా చెప్పారు.తాము బెల్జియం నుంచి వస్తున్నామని , వ్యాన్ వెనుక భాగంలో పాత టైర్లు ఉన్నట్లు చెప్పినట్లు యూకే హోం ఆఫీస్ వెల్లడించింది.
వ్యాన్‌ను తనిఖీ చేయగా.అత్యంత దుర్భరమైన, ప్రమాదకరమైన పరిస్ధితుల్లో వలసదారుల సమూహం కనిపించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy