స్టార్ హీరో బాలయ్య( Balayya ) స్టార్ డైరెక్టర్ బాబీ( Bobby ) కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.ఈరోజు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేర్వేరు కారణాల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఈవెంట్ క్యాన్సిల్ చేయడం వెనుక ముఖ్యమైన కారణం ఉండటంతో అభిమానులు కూల్ అయ్యారు.అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ మాత్రం జరగడం లేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపటికి వాయిదా వేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో( Daaku Maharaaj Promotions ) బాలయ్య పెద్దగా కనిపించలేదు.
ట్రైలర్ లో బాలయ్య మార్క్ డైలాగ్స్ లేకపోవడం కూడా ఈ సినిమాపై అంచనాలు తగ్గడానికి కారణమయ్యాయని చెప్పవచ్చు.డాకు మహారాజ్ మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.
డాకు మహారాజ్ మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని తెలుస్తోంది.నైజాంలో దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.నైజాంలో డాకు మహారాజ్ సినిమాకు ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.ఆంధ్ర, సీడెడ్ లో గతంలో ఏ సినిమాకు జరగని స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరిగింది.
డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ మాత్రం ఫీలవుతున్నారు.
సితార నిర్మాతలు ప్రతి సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేవారు.డాకు మహారాజ్ తమిళ, హిందీ భాషల్లో ఒకింత ఆలస్యంగా విడుదల కానుందని తెలుస్తోంది.ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను ఆ భాషల్లో రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.
డాకు మహారాజ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాల్సి ఉంది.