జుట్టు హెయిర్ స్టైల్ కోసం ఏకంగా 14 కోట్లు..?!

హెయిర్ కట్ కు సంబంధించి చాలా మంది రకరకాలుగా ఆలోచిస్తుంటారు.తమ హెయిర్ అలా ఉండాలని, ఆ స్టైల్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు.

అందుకోసం వారు చాలా డబ్బులు కూడా ఖర్చు చేస్తుంటారు.తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి తన హెయిర్ కట్ కోసం చాలా డబ్బును ఖర్చు చేశాడు.అమెరికాలోని లిల్ ఉజీ వెర్ట్ అనే ర్యాపర్ తన నుదుటికి రూ.175 కోట్ల విలువైన పింక్ డైమండ్ కుట్టుకుని కలకలం రేపాడు.సాధారణంగా ఎవరైనా తమ తల అందంగా కనిపించాలని, నిగారింపుతో ఉండాలని రంగు రంగుల డైలు వేసుకుని అలంకరించుకుంటారు.

అయితే మెక్సికోకు చెందిన ర్యాపర్‌ డాన్‌ సుర్ మాత్రం తన తలనంతా బంగారమయం చేసుకున్నాడు.తలంతా బంగారపు గొలుసులు ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు.అందుకోసం అతను ఏకంగా రెండు మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.14 కోట్లను ఖర్చు పెట్టి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు.ప్రస్తుతం ఈ బంగారం జుట్టు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రముఖ మెక్సికన్‌ ర్యాపర్‌ డాన్‌ సుర్‌ జుట్టును బంగారు గొలుసులతో రెడీ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తన బంగారం హెయిర్ స్టైల్ కోసం దాదాపుగా అతను రెండు మిలియన్‌ డాలర్లను ఖర్చు పెట్టడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.జుట్టుకోసం తలపైన మొత్తం కూడా కొన్ని రకాల డిజైన్లతో బంగారు గొలుసులను అమర్చుకున్నాడు.

దీంతో అతని బంగారు జుట్టు కలను నెరవేరినట్లైంది.

అతను ఇలా బంగారు జట్టును ఏర్పాటు చేసుకోవడం సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఆ బంగారు జుట్టును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా కోటీశ్వరులు కావాలంటే అతని జుట్టును పట్టుకుంటే చాలని, ఆ జుట్టుతో కోటీశ్వరులు అయిపోవడం ఖాయమని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

బంగారపు గొలుసులతో జుట్టును ఏర్పాటు చేసుకున్న మొదటి ర్యాపర్ డాన్ సుర్ కావటం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.

దొరికేసాడు.. దొరికేసాడు.. ఇండియన్ స్పైడర్ మ్యాన్ ఇదిగో.. (వైరల్ వీడియో)
Advertisement

తాజా వార్తలు