100 మిలియన్‌తో అల వైకుంఠపురము రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.థమన్ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన పాటలు ఫుల్ స్వింగ్‌తో రావడంతో శ్రోతలు ఫుల్ ఖుషీ చేస్తున్నారు.

కాగా రిలీజ్ అయిన రెండు పాటలు కూడా చార్ట్‌బస్టర్స్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాయి.సామజవరగమన, రాములో రాములా అంటూ థమన్ అందించిన పాటలకు తెలుగు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు.

దీంతో ఈ పాటలకు ఇప్పటికే మిలియన్ స్ట్రీమ్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ పాటలు ఇంతలా హిట్ కావడానికి బన్నీ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా కారణమని తెలిపారు చిత్ర యూనిట్.

Advertisement

బన్నీ నటిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.త్రివిక్రమ్ దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు సినీ జనం.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

ఆ సెంటిమెంట్ ప్రకారం కాంతార మూవీ ప్రీక్వెల్ ఫ్లాప్ కానుందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు