ప్రస్తుతం తెలుగు జనాలు ఆసక్తిగా చూస్తున్న బిగ్‌బాస్ 3 తెలుగు రియాల్టీ షో గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది.అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
వారిలో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, అలీ రాజా, వరుణ్ సందేష్‌లు ఉన్నారు.అయితే ఫైనల్‌లో విజేత ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
కాగా వీటన్నింటిలో ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా గూగుల్ చెబుతున్న రిజల్ట్ మాత్రం జనాల చూపును ఆకట్టుకుంటోంది.ఇందులో ప్రత్యేకత ఏమిటనేగా మీ సందేహం.
గూగుల్‌లో బిగ్ బాస్ 3 తెలుగు విన్నార్ అని టైప్ చేస్తే రాహుల్ సిప్లిగంజ్‌ను చూపిస్తోంది గూగుల్.దీంతో బిగ్ బాస్ 3 తెలుగు విజేత రాహుల్ అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాహుల్ ఫ్యాన్స్ కూడా రచ్చ చేస్తున్నారు.
టీఆర్పీలో దూసుకుపోతున్న బిగ్ బాస్ 3లో విజేత ఎవరనేది తెలియాలంటే ఈ నెల 3వ తేదీ వరకు ఆగాల్సిందే అంటున్నారు నిర్వాహకులు.మరో రెండు రోజుల్లో ముగుస్తున్న ఈ షో విజేత ఎవరనే అంశం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.







