ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ గా నరేంద్ర మోడీ

తాజాగా దేశంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి తన సామర్థ్యంతో ఘన విజయం సొంతం చేసుకున్న నేత ప్రధాని నరేంద్ర మోడీ.

తన నాయకత్వ పటిమతో బిజెపిని ముందుండి నడిపి ఊహించని విధంగా మరోసారి దేశ ప్రజల మనసు దోచుకున్న ప్రధాని సామర్ధ్యం ఇప్పుడు ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది.

ఇప్పటికే ప్రధానిగా మోడీ బాద్యతలు తీసుకున్న తర్వాత మేక్ ఇన్ ఇండియా విజయ్ తో ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసే విధంగా చేసుకున్నాడు.అలాగే ప్రపంచంలో ప్రముఖ వ్యాపార సంస్థలు ఇండియాలో కంపెనీలు పెట్టి తమ ప్రొడక్ట్స్ ని అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో ప్రపంచంలో ఇప్పుడు మోడీ అత్యంత ప్రభావశీలమైన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ బ్రిటిష్ మ్యాగజైన్ బ్రిటిష్ హెరాల్డ్ నిర్వహించిన రీడర్ పోల్ ప్రపంచంలోనే పవర్ఫుల్ పర్షన్ గా నరేంద్ర మోడీ ఎంపికయ్యారు.

ప్రపంచంలో ఇతర దేశాల నేతలు అధిగమించి మోడీ శక్తివంతమైన నేతగా ఎంపికయ్యారని ఈ సందర్భంగా బ్రిటిష్ హెరాల్డ్ తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోల్లో 30.9 శాతం పాఠకులు మోడీకి అత్యంత గొప్ప నాయకుడుగా ఓటేశారు.మోడీ తర్వాత స్థానంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్ పింగ్ నిలవడం విశేషం.

Advertisement

వీరి ముగ్గురిని అధిగమించి మోడీ ఫైనల్ రౌండ్లో విజేతగా నిలిచి ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ
Advertisement

తాజా వార్తలు