రైతును ఎడిపిస్తే కేంద్రానికి పుట్టగతులుండవు:గుత్తా

నల్లగొండ జిల్లా:రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో సాకులు చూపుతూ రైతులను ఏడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.

పీయూష్ గోయల్ వంటి చార్టెడ్ అకౌటెంట్లకు రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని విమర్శించారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడాతూ తనను రెండో సారి శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ధాన్యం కొనుగోళ్ళపై రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కేంద్రం మానుకోవాలని హితవు పలికారు.

If The Farmer Is Disturbed, The Center Will Not Be Inherited: Gutta-రైతు

యాసంగి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మార్గం చూపించాలని డిమాండ్ చేశారు.దేశంలో ఉన్న రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని,రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష పూరిత విధానాన్ని మార్చుకోవాలన సూచించారు.

పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.పంజాబ్ రాష్ట్రానికి ఒక న్యాయం తెలంగాణ రాష్ట్రానికి మరొక న్యాయం ఎలా ఉంటుందని నిలదీశారు.

Advertisement

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన సమాధానం బాధ్యతారాహిత్యంగా ఉందని మండిపడ్డారు.

సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!
Advertisement

తాజా వార్తలు