భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాయాబజార్ లో ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మాయాబజార్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ మేరకు సెల్ టవర్ ఎక్కి గ్రామస్తులు నిరసనకు దిగారు.

ఇళ్ల పట్టాల కోసం నిర్వాసితులు సెల్ టవర్ ఎక్కి ఆందోళన కార్యక్రమం చేపట్టారని తెలుస్తోంది.వెంటనే సమాచారం అందుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన నిరసనకారులకు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో సెల్ టవర్ పై నుంచి దిగి రావాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

నిర్వాసితుల ఆందోళనతో గ్రామంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Advertisement
ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?

తాజా వార్తలు