భగ్గుమన్న భానుపురి మహిళలు

సూర్యాపేట జిల్లా:పెరిగిన గ్యాస్,డీజిల్ ధరలకు నిరసనగా భానుపురి మహిళా లోకం భగ్గుమంది.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నడుం బిగించిన నారీ లోకం,ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్ల-కార్డుల ప్రదర్శన చేపట్టారు.

గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు పోరాటం కొనసాగుతోందంటూ మహిళలు హెచ్చరిక చేశారు.కొత్త బస్ స్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబోమ్మను దగ్దం చేసిన మహిళలు, మోడీపై మహిళల మరో తిరుగుబాటు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.

పెరిగిన గ్యాస్,డీజిల్ ధరలపై మహిళలు తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.కేంద్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నారీ లోకం పెద్ద ఎత్తున స్పందించి వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.

ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ,కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని,పెరిగిన గ్యాస్,డీజిల్ ధరలు తగ్గించాలి అంటూ మహిళా లోకం చేస్తున్న నినాదాలతో సూర్యాపేట పట్టణం మారుమ్రోగింది.పెరిగిన గ్యాస్,డీజిల్ ధరలకు నిరసన తెలుపాలంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి మొదలైన మహిళల నిరసన ప్రదర్శన శంకర్ విలాస్,యంజి రోడ్, తెలంగాణా తల్లి విగ్రహం మీదుగా కొత్త బస్ స్టాండ్ కు చేరుకుంది.

Advertisement

భారీ ఎత్తున తరలి వచ్చిన నారీ లోకం ప్రధాని మోడీపై తిరుగుబావుటాకు సిద్ధం అంటూ నినాదాలు చేయడంతో పాటు,పెంచిన గ్యాస్,డీజిల్ ధరలకు నిరసనగా కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ,అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మురికి కంపు కొడుతు666న్న కోదాడ మున్సిపాలిటీ
Advertisement

తాజా వార్తలు