దేశ సమగ్రత కోసమే బీజేపీ స్థాపన..: కిషన్ రెడ్డి

దేశ సమగ్రత కోసం బీజేపీని స్థాపించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

బీజేపీ ఏర్పడక ముందు భారతీయ జన సంఘ్ గా ఉండేదని చెప్పారు.

దీన్ని శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.అనంతరం దీన్ దయాల్ జన సంఘ్ ను బీజేపీగా మార్చారన్నారు.

దీన్ దయాల్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు.దీన్ దయాల్ ఎన్నడూ తన విలువలు కోల్పోలేదన్న కిషన్ రెడ్డి పేదల కోసం అంత్యోదయ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దీన్ దయాల్ అని తెలిపారు.

మోదీ ప్రభుత్వం దీన్ దయాల్ ఆశయ సాధన కోసం పనిచేస్తోందన్నారు.బీజేపీ అవినీతి, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతోందని తెలిపారు.

Advertisement
కథ చెబితే బైక్ ఇచ్చేస్తాను.. వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం క్రేజీ కామెంట్స్!

తాజా వార్తలు