పేటల్ గెహ్లట్….( Petal Gahlot ) ఉన్నట్టుండి సోషల్ మీడియా లో, ఇంటర్నేషనల్ న్యూస్ లోను ఈ పేరు మారుమ్రోగుతోంది.
ఈమె అంతర్జాతీయ వేదికలపై భారతదేశ గళం. మన దేశ విదేశాంగ విధానాలను మన ప్రభుత్వం తరుపున ప్రపంచానికి ప్రకటించే స్వరం.ఈమె ప్రస్తుతం ఐక్యరాజసమితిలో( UNO ) ఇండియన్ మిషన్ తో ది యునైటెడ్ నేషన్స్ కి ఫస్ట్ సెక్రెటరీగా పని చేస్తుంది.ఐతే ఇంతవరకు మన దేశం లో కూడా ఎప్పుడు వినిపించని ఈమె పేరు ఉన్నట్టుండి ప్రపంచం మొత్తం ఇలా మారుమ్రోగేదానికి కారణం ఏమిటో తెలుసా? తెలుసుకోవాలంటే ఇది చూడండి.
ప్రపంచం వేదికలపై మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్,( Pakistan ) భారత్ పై( India ) విషం కక్కడం కోతేమి కాదు.యధావిధి గానే శుక్రవారం యూ ఎన్ సర్వసభ సమావేశంలో పాకిస్తాన్ మల్లి భరత్ పై నిందలు వేసింది.
పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న అన్వార్ ఉల్ హక్ కకర్( Anwaar-Ul-Haq Kakar ) ఆ సమావేశం లో కాశ్మిర్ వివాదాన్ని లేవనెత్తి ఏదేదో వాగాడు.ఆ తరువాత అన్వార్ ఉల్ హక్ అన్న మాటలకు రైట్ తో రిప్లై కింద పేటల్ గెహ్లట్ మాట్లాడటం మొదలుపెట్టింది.
పాకిస్తాన్ ప్రధాని అని కూడా చూడకుండా లెఫ్ట్ అండ్ రైట్ తన ప్రశ్నలతో ఘాటు సమాధానం ఇచ్చింది.
పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డా అని, ముంబై దాడులకు సంబంధించిన ఉగ్రవాదులను( Terrorists ) ఎన్నో ఏళ్లుగా కాపాడుతున్నారని, ఇండియా పాకిస్తాన్ మధ్య క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఆపడంలేదని అన్నారు.తప్పు తమవైపు ఉంచుకొని ఎదుటి దేశాలపై నిందలు వేయడం సరికాదని అన్నారు.కాశ్మీర్( Kashmir ) విషయానికి స్పందిస్తూ భారత్ పై నిందలు వేయడం మాని ముందు మీరు ఆక్రమించిన కాశ్మీర్ ను ఖాళీ చెయ్యండి అంటూ విరుచుకుపడింది.ఇతర దేశాల విషయాలలో వేలు పెట్టె బదులు మీ దేశంలో జరుగుతున్నా మానవ హక్కుల ఉల్లంఘనను చేతనైతే ఆపండి అని
ప్రపంచ వేదిక సాక్షిగా అన్వార్ ఉల్ హక్ పరువు తీసేసింది పేటల్ గెహ్లవుట్.అంతర్జాతీయ అధికార వేదికపై సూటిగా పాకిస్తాన్ ను పిఓకే ను( POK ) ఖాళీ చెయ్యమని చెప్పడం ఇదే తోలిసారి.పేటల్ గెహ్లవుట్ రాజపుట్ కుటుంబానికి చెందిన మహిళ.ఆమె ముంబై లోని సెయింట్ జెవిఆర్స్ కాలేజీ నుంచి బి ఎ పొలిటికల్ సైన్స్ పట్టా అందుకున్నారు.తరువాత ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి ఏంఏ పొలిటికల్ సైన్స్ పట్టా అందుకున్నారు.2015 లో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ లో చేరిన గెహ్లవుట్, ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.