కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తనతో కలత చెందిన డాక్టర్ రాజీనామా

సూర్యాపేట జిల్లా:ఆసుపత్రిలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తన ఓ ప్రభుత్వ డాక్టర్ కు ఆవేదన కలిగించింది.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలత చెంది అవమానభారంతో రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలంకు గురువారం తన రాజీనామా పత్రాన్ని అందజేసింది.

వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారిగా పని చేస్తున్న డాక్టర్ ఉషారాణి పట్ల అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సీవో ఉపేందర్ దురుసుగా ప్రవర్తించాడు.విధులకు సక్రమంగా రానందుకు ప్రశ్నించిన డాక్టర్ పై దురుసుగా ప్రవర్తించిన డిఫెండర్ తీరును ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది.

తాను ఫిర్యాదు చేసే సమయంలో డీఎంహెచ్వో,డిప్యూటీ డీఎంహెచ్వో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది.స్పందించిన కలెక్టర్ విచారణ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు.

దీంతో డీఎంహెచ్వో సీసీ అర్బన్ హెల్త్ సెంటర్కు వచ్చి కలెక్టర్ కు ఎందుకు ఫిర్యాదు చేశావు అంటూ ప్రశ్నిస్తూ తనకు సంబంధం లేని విషయాలపై వేధింపులకు గురిచేశాడని సదరు డాక్టర్ ఆరోపించింది.ఈ విషయమై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేయగా విచారణ చేస్తామని చెబుతూ దాటవేస్తున్నారన్నారు.

Advertisement

కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చే విలువ మెడికల్ ఆఫీసర్కు ఇవ్వడం లేదని కలత చెందిన డాక్టర్ ఉషారాణి తన విధులకు రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలంకు రాజీనామా పత్రాన్ని అందజేసింది.ఈ విషయమై వైద్యాధికారిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్
Advertisement

తాజా వార్తలు