జీ తెలుగు సరిగమప సీజన్​ 16: ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్​.. మన వరంగల్​, కరీంనగర్​లో!

హైదరాబాద్​,​ 06 ఆగస్ట్​ 2024: తెలుగు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్​ జీ తెలుగు( Zee Telugu) ఫిక్షన్​, నాన్-ఫిక్షన్​ షోతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో​ వినోదం అందించడంతోపాటు​ ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

సరిగమప నిర్వహించిన 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది.

​విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు ‘సరిగమప సీజన్‌ 16‌- ది నెక్ట్స్ సింగింగ్​ యూత్​ ఐకాన్​’​ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్​ నిర్వహిస్తోంది.

ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది.జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్​ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది.ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ శని, ఆదివారాల్లో మన వరంగల్​, కరీంనగర్​​( Karimnagar )లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది.15-30 సంవత్సరాల వయస్సుగల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు.సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి.వరంగల్​( Warangal)లో ఆగస్టు 10న ఆల్ఫోర్స్​​ జూనియర్ కాలేజ్​, నయీమ్​ నగర్​, హన్మకొండ, ఆగస్టు 11న కరీంనగర్​లోని ఆల్ఫోర్స్​ ఇ-టెక్నో స్కూల్​, కొత్తపల్లిలో ఆడిషన్స్​ జరగనున్నాయి.

వివరాల కోసం 9154670067 నెంబర్​పై సంప్రదించవచ్చు.ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్​ ఛాన్స్​ని మిస్​ కావద్దు!అంతేకాదు ఔత్సాహికులు ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.పాట పాడిన తమ వీడియోలను 9154670067 నెంబర్​కి వాట్సాప్ లేదా ztsaregamapa@zee.com ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.

Advertisement

ఇంకెందుకు ఆలస్యం జీ తెలుగు ‘సరిగమప సీజన్​ 16 – ది నెక్ట్స్​ సింగింగ్​ యూత్​ ఐకాన్’ టైటిల్​ కోసం మీరూ పోటీలో పాల్గొనండి!మీలోని ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని వేదిక.జీ తెలుగు సరిగమప సీజన్​ 16- ది నెక్ట్స్​ సింగింగ్​ యూత్​ ఐకాన్.

ఆడిషన్స్​లో వెంటనే పాల్గొనండి! .

Advertisement

తాజా వార్తలు