వైఎస్ వివేకా కేసు: మొదటి రోజు ముగిసిన సీబీఐ కస్టడీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ మొదటి రోజు ముగిసింది.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారులు వీరిని విచారించారు.

వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి నెల రోజుల ముందు కుట్ర పన్నారని, అందుకోసం రూ.40 కోట్లను సిద్ధం చేసుకున్నారని సీబీఐ వాదిస్తున్న సంగతి తెలిసిందే.  మరోవైపు ఇదే కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు