టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Manchu Manoj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మోహన్ బాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే మంచు మనోజ్ ఒక ఇంటి వాడైన సంగతి తెలిసిందే.భూమా మౌనిక రెడ్డిని( Bhuma Mounika Reddy ) రెండవ వివాహం చేసుకున్నారు మంచు మనోజ్.
ఇద్దరికీ ఇది రెండో వివాహం అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మనోజ్ ఆయన భార్య భూమి మౌనిక రెడ్డి ఇద్దరు కలిసి వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది( Ala Modalaindi Show ) షోకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలు తెలిపారు మంచు మనోజ్.ఈ నేపథ్యంలోనే వెన్నెల కిషోర్ మంచు మనోజ్ ని ప్రశ్నిస్తూ.ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందనే విషయం మొదట ఎవరికి అనిపించింది?ఎవరు చెప్పారు? అని అడగగా.ఆ విషయం పై స్పందించిన మంచు మనోజ్.
నేనే చెప్పాను.నా జీవితంలో ఎదుర్కొన్న బాధలే చాలా పెద్దవి అనుకునేవాడిని.
కొన్ని రోజుల పాటు ఏ పనీ చేసేవాడిని కాదు.ఆ సమయంలో మౌనిక పడిన కష్టాలు చూసిన తర్వాత నా బాధలు చాలా చిన్నవి అనిపించాయి.
అప్పుడు నువ్వేంటే ఇష్టం.ప్రాణం అని చెప్పాను.
అప్పుడు మళ్లీ సంతోషం.ఆశ.జీవితంలో వెలుగు వస్తుందంటే అది నీ వల్లే.నాకు హ్యాపీగా బతకాలని ఉంది.
నలుగురితో సంతోషంగా ఉండాలని ఉంది.నువ్వు ఒప్పుకొంటే నిన్ను, బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా అని చెప్పాను అని చెప్పుకొచ్చారు మంచు మనోజ్.
అప్పుడు మౌనిక సరిగానే ఆలోచించి చెప్పావా? ఈ సొసైటీ గురించి ఆలోచించావా? ఇంట్లో ఒప్పుకుంటారా అని అని నన్ను ప్రశ్నించింది అప్పుడు నేను.అవన్నీ నేను పట్టించుకోను.
ఇంట్లో నేను ఒక మాట చెబితే నో చెప్పరు.పైగా అది నా సమస్య.అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాను అని చెప్పుకొచ్చాడు హీరో మంచో మనోజ్.అందుకు మౌనిక కూడా ఓకే చెప్పిందని సంతోషంగా తెలిపారు.శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు.ఆ తర్వాతే మా వనవాసం మొదలైంది.
ఆ సమయంలో చాలా కష్టపడ్డాము చాలా దేశాలు తిరిగాము.అలా చెప్పుకుంటూ పోతే రెండవ సీజన్ కూడా మన షోనే నడుస్తుంది ఒక్కో ఎపిసోడ్ కి ఒక కథ చెబుతాను అంటూ ఫన్నీగా స్పందించారు.