లోటస్ పాండ్ లో వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ ఆత్మీయులతో మరియు మద్దతుదారులతో జిల్లాల వారీగా సమావేశమవుతున్న సంగతి తెలిసిందే.ఇదే తరుణంలో ఇటీవల గిరిజన నాయకులతో భేటీ అయిన షర్మిల తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల నాయకులతో భేటీ అవడానికి రెడీ అవ్వడం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య అదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు తీరుపై చర్చించనున్నట్లు అదేరీతిలో విద్యార్థుల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.?, ఇంకా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం నుండి వాళ్లు ఏమి ఆశిస్తున్నారు వంటి విషయాలు పై వారి అభిప్రాయాలు తీసుకునే విధంగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.దాదాపు 350 మంది విద్యార్థులు ఈరోజు జరగబోయే సమావేశంలో షర్మిల తో భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.