తెలంగాణ రాజకీయాల్లో కొత్త పంథా అనుసరిస్తున్న వైఎస్ షర్మిల.. ?

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఆరాటపడుతున్న వైఎస్ షర్మిలకు కారు పార్టీ నేతల నుండి ఎన్నో విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే.

అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం ఖాయం.

దొరలపాలన నుండి ప్రజలకు విముక్తి ప్రసాదించే వరకు ఆపను ఈ పోరాటం అంటూ వైఎస్ షర్మిల బీష్మించుకు కూర్చున్నారట.

ఈ నేపధ్యంలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని మూటగట్టుకునే పనిలో పడినట్లుగా సమాచారం.ఇప్పటికే గులాభి పార్టీకి ఉన్న ముళ్లు గుచ్చుకుంటు బయటపడక బాధపడుతున్న టీఆర్ఎస్ వ్యతిరేక శ్రేణులను కలుసుకుంటూ తన ప్రణాళికను వివరిస్తూ కారును పంక్చర్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో స్పందించిన వైఎస్ షర్మిల తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని, కానీ కేసులకు భయపడే ఈటల బీజేపీ వైపు దారి మళ్లారని వ్యాఖ్యానించారు.

ఇకపోతే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్న షర్మిల, రాజకీయాల్లో అనుసరిస్తున్న కొత్త పంథా ఏమేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Advertisement
పైసా ఖర్చు లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడం ఎలాగో తెలుసా?

తాజా వార్తలు