టీడీపీ మేనిఫెస్టో పై జగన్ కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 13 రోజులు మాత్రమే సమయము ఉంది.ఈ క్రమంలో మంగళవారం చంద్రబాబు( Chandrababu ) కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు.

టీడీపీ మేనిఫెస్టోపై( TDP Manifesto ) సీఎం జగన్( CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.

కూటమి మేనిఫెస్టో విడుదలకు ముందు ఢిల్లీ నుండి బీజేపీ అధిష్టానం చంద్రబాబుకి ఫోన్ చేసింది.మేనిఫెస్టోలో మీ ఫోటోలు పెట్టుకోండి.

ప్రధాని మోడీ ఫోటోలు పెట్టొద్దని చెప్పారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు హామీలు మోసమని బీజేపీ వాళ్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement
YS Jagan Key Comments On TDP Manifesto Details, YS Jagan, TDP Manifesto, Cm Jag

అందుకే మేనిఫెస్టో కాపీలపై మోడీ ఫోటో పెట్టేందుకు బీజేపీ( BJP ) ఒప్పుకోలేదని వ్యాఖ్యానించారు.

Ys Jagan Key Comments On Tdp Manifesto Details, Ys Jagan, Tdp Manifesto, Cm Jag

కూటమిలోని ముగ్గురి ఫోటోలు మేనిఫెస్టో కాపీలపై పెట్టుకునే పరిస్థితి లేదని ఎద్దేవ చేశారు.అధికారం కోసం సూపర్ సిక్స్ పేరిట సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కార్ ఇస్తామంటున్నారు, కూటమి మేనిఫెస్టోను మీరు నమ్ముతారా అని ప్రజలను ప్రశ్నించారు.

ఈ రకంగానే 2014లో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు.అవ్వ తాతలకు ఇంటి వద్దకే అందే పెన్షన్ ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారు.కానీ ప్రజలలో వ్యతిరేకత రావటంతో తన కుట్రలను.మనపై నెడుతున్నాడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెన్ను నొప్పికి కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను ఎలా వ‌దిలించుకోవాలి..?
Advertisement

తాజా వార్తలు