'జొమాటో' యాడ్ కోసం అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్( Allu Arjun ) మొదట్లో చూసి ఇతను హీరో ఏంటిరా బాబు అని అందరూ అనుకున్నారు.

కానీ అదే హీరో తన సొంత కష్టం తో లుక్స్ దగ్గర నుండి యాక్టింగ్ వరకు ప్రతీ విషయం లో ది బెస్ట్ ని ఇస్తూ, ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేసి నేడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ స్టార్ గా ఎదిగాడు.

ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఇతర రాష్ట్రాల్లో రాజమౌళి తర్వాత బిగ్గెస్ట్ బ్రాండ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అల్లు అర్జున్ సినిమాల కోసం ఇప్పుడు కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతీ సినీ అభిమాని ఆయన సినిమా కోసం ఎదురు చూస్తారు.

ఆ స్థాయిలో ఆయన తన ఇమేజి ని పుష్ప చిత్రం తో ఏర్పాటు చేసుకున్నాడు.

You Will Be Surprised To Know The Remuneration That Allu Arjun Is Taking For zo

ఇప్పుడు పుష్ప: ది రూల్ చిత్రం పై అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ సినిమా మన టాలీవుడ్ నుండి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ భారీ అంచనాలు పెట్టుకుంది.ఆ అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది ఆగష్టు 15 వరకు ఆగాల్సిందే.

Advertisement
You Will Be Surprised To Know The Remuneration That Allu Arjun Is Taking For 'zo

ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అప్పట్లో ఒక్కో యాడ్ చెయ్యడం కోసం కేవలం 35 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసుకునేవాడు.స్టార్ హీరోలందరి కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో గా అప్పట్లో అల్లు అర్జున్ కి ఒక పేరు ఉండేది.

కానీ ఇప్పుడు ఆయన ఒక్కో యాడ్ చెయ్యడం కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాస్ట్ అవ్వక తప్పదు.

You Will Be Surprised To Know The Remuneration That Allu Arjun Is Taking For zo

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల్లో దేశం లోనే టాప్ 2 స్థానాల్లో ఉన్న సంస్థ జొమాటో( Zomato ).ఎవరికైనా ఏదైనా ఇష్టమైన ఆహారం ని తినాలని అనుకుంటే ఈ రెండు యాప్స్ లో ఆర్డర్ చేస్తే చాలు, క్షణాల్లో ఇంటి ముందుకు వచ్చి వాలుతుంది.అల్లు అర్జున్ జొమాటో యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ సంస్థ కోసం ఆయన చేసే ఒక్కో యాడ్ కి 6 నుండి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు అట.ఎక్కడ 35 లక్షలు, ఎక్కడ ఆరు కోట్లు.అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు