రాజధానిపై వైసీపీ అసలు ట్విస్ట్ ఇదేనా ? ఆ వ్యూహంలో టీడీపీ చిక్కుకుందా ?

కొద్ది రోజులుగా రాజధాని విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సాగుతున్న మాటల యుద్ధంలో తమది పై చేయి అంటే తమది అన్నట్టుగా ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుకుంటూ హడావుడి చేస్తున్నారు.

అమరావతి విషయంలో ఎన్ని నిందలు వస్తున్నా అటు టీడీపీ ఇటు వైసీపీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా గళం ఎత్తుతున్నాయి.

వైసీపీ మంత్రి బొత్స రాజధాని మీద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.అసలు ఈ వ్యవహారంలో వైసీపీ అంతా ఒక వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్తోంది.

అసలు టీడీపీని ఈ వ్యవహారంలో అడ్డంగా ఇరికించేందుకే వైసీపీ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.అందుకే అమరావతి విషయంలో దూకుడుగా బొత్స ప్రకటనలు చేస్తున్నారు.

రాజధానిపై సంబంధిత శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత లేదని కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచే వ్యతిరేకత వ్యక్తం అయ్యింది అన్న సంగతి వైసీపీ గుర్తించింది.

Advertisement

ఈ వ్యూహం ఇలా అమలవుతుండగానే వైసీపీకి మేలు చేసేలా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వైసీపీకి బూస్ట్ ఇచ్చేలా ప్రకటనలు చేసాడు.ఏపీకి నాలుగు రాజధానులంటూ ఆయన చేసిన ప్రకటనతో ఆ ప్రాంతాల్లో కొత్త ఆశలు మొలకెత్తాయి.ఇదే అదునుగా త్వరలో ప్రాంతీయ బోర్డ్ లను ప్రకటించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతిపక్షమైన టీడీపీని ఇరుకున పెట్టే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోంది.ఒకవేళ రాజధానిపై కోస్తా ప్రాంతంలో గొడవలు జరిగితే మిగతా ప్రాంతాల ప్రజల్లో ఈ పరిణామంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వైసీపీ భావిస్తుండగానే బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ నాలుగు రాజధానులు వస్తాయంటూ విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప పేర్లను ప్రకటించడంతో ఆ ప్రాంతవాసుల్లో సానుకూలత వ్యక్తం అయ్యింది.

ఇది అమరావతిపై ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత పెరగడంతో పాటు వైసీపీ తీసుకున్న నిర్ణయాలను స్వాగతించే పరిస్థితి వస్తుందని అంచనా వేస్తోంది.

అమరావతి విషయంలో టీడీపీ గట్టిగా పోరాటానికి దిగినా పెద్దగా ఉపయోగం ఉండదని, కేవలం కేవలం రాజధాని పరిసర ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల టీడీపీ పై వ్యతిరేకత పెరుగుతుందని వైసీపీ భావిస్తోంది.అసలు ఇప్పటికే రాజధాని కోసం తాము అండగా ఉంటామని టీడీపీ ప్రకటించింది.వైసీపీ కూడా అందుకే రాజధాని అంశంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

బీజేపీ కూడా రాజధానిని అమరావతిలోనే ఉంచాలని ప్రకటన చేయటం, ఆ పార్టీ నేతలు సైతం రాజధానిలో పర్యటించటం, సీపీఐ, సీపీఎం నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతులతో గళం కలపటం వైసీపీ నేతలకు కాస్త ఇబ్బందికరంగా మారింది.కానీ ఇదే సమయంలో మిగతా ప్రాంతాల్లో వైసీపీ తీసుకునే నిర్ణయాలకు పూర్తిగా మద్దతు లభిస్తుందనే అంచనాలో ఉంది.

Advertisement

మొత్తంగా ఈ వ్యవహారంలో టీడీపీ బలి పశువుగా మారుతుందని వైసీపీ లెక్కలు వేస్తోంది.

తాజా వార్తలు