రాజధాని తరలింపు ప్రారంభం అయ్యిందట

ఒక వైపు అమరావతి ప్రాంత రైతులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు రాజధాని తరలింపు వద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు.

గత రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కు తగ్గనుందా అనే ప్రచారం జరిగింది.

హస్తినలో సైతం అమరావతి రైతులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు చాలా సీరియస్‌గా కేంద్ర పెద్దల వద్ద మొరపెట్టుకోవడంతో రాజధాని మార్పు ఆగే అవకాశం ఉందని అనుకున్నారు.కాని మంత్రి బొత్స మాత్రం రాజధాని తరలింపు ప్రారంభం అయ్యిందని ప్రకటించాడు.

ఏపీ అసెంబ్లీలో పాస్‌ అయిన వికేంద్రీకరణ బిల్లుకు అనుగుణంగా మూడు రాజధానుల ఏర్పాటు కాబోతుందని, అందుకు సంబంధించిన చర్చలు మరియు సంప్రదింపులు అన్ని ఇప్పటికే పూర్తి అయ్యింది.కనుక రాజధాని తరలింపు పక్రియ ప్రారంభం అయినట్లుగానే పరిగణించాల్సిందిగా ఆయన పేర్కొన్నాడు.

తెలుగు దేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా రాజధాని తరలింపును అడ్డుకోవడం వారి వల్ల కాదంటూ బొత్స అన్నాడు.మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ది చేయాలనేది జగన్‌ ఉద్దేశ్యంగా మంత్రి చెప్పుకొచ్చారు.

Advertisement
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

తాజా వార్తలు