పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం బాలీవుడ్‌లో తెరకెక్కిన పింక్ రీమేక్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి పవన్ ఇండస్ట్రీ రికార్డులకు ఎసరు పెట్టాడు.కాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఈ సినిమాపై తాజాగా ఓ కామెంట్ చేశాడు.
ఇటీవల అల వైకుంఠపురములో సినిమాకు అదిరిపోయే సంగీతం అందించిన థమన్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు.కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
దీంతో తాజాగా ప్రేక్షకులో థమన్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడాడు.ఇందులో భాగంగా థమన్ పింక్ రీమేక్ చిత్రానికి సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ ఫోటోలను చూసినట్లు, అందులో ఆయన సరికొత్త అవతారంలో అదరగొట్టడం ఖాయమని థమన్ అంటున్నాడు.
ఇక ఈ సినిమా కోసం థమన్ కూడా అదిరిపోయే మ్యూజిక్ అందించనున్నాడట.అల వైకుంఠపురములో సినిమాకు అందించిన సంగీతం కంటే కూడా పవన్ సినిమాకు అదిరిపోయే సంగీంత అందించేందుకు తాను ప్రయత్నిస్తున్నానంటూ థమన్ చెప్పుకొచ్చాడు.
దీంతో పవన్ కోసం థమన్ ఎలాంటి సంగీతం అందిస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.







