రాజధాని తరలింపు ప్రారంభం అయ్యిందట

ఒక వైపు అమరావతి ప్రాంత రైతులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు రాజధాని తరలింపు వద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు.గత రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కు తగ్గనుందా అనే ప్రచారం జరిగింది.

 Ycp Minister Botsa Satyanarayana Comments On Ap Capitals-TeluguStop.com

హస్తినలో సైతం అమరావతి రైతులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు చాలా సీరియస్‌గా కేంద్ర పెద్దల వద్ద మొరపెట్టుకోవడంతో రాజధాని మార్పు ఆగే అవకాశం ఉందని అనుకున్నారు.కాని మంత్రి బొత్స మాత్రం రాజధాని తరలింపు ప్రారంభం అయ్యిందని ప్రకటించాడు.

ఏపీ అసెంబ్లీలో పాస్‌ అయిన వికేంద్రీకరణ బిల్లుకు అనుగుణంగా మూడు రాజధానుల ఏర్పాటు కాబోతుందని, అందుకు సంబంధించిన చర్చలు మరియు సంప్రదింపులు అన్ని ఇప్పటికే పూర్తి అయ్యింది.కనుక రాజధాని తరలింపు పక్రియ ప్రారంభం అయినట్లుగానే పరిగణించాల్సిందిగా ఆయన పేర్కొన్నాడు.

తెలుగు దేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా రాజధాని తరలింపును అడ్డుకోవడం వారి వల్ల కాదంటూ బొత్స అన్నాడు.మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ది చేయాలనేది జగన్‌ ఉద్దేశ్యంగా మంత్రి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube