రోడ్డుపై కాగితాలు ఏరుకుని బ్రతికాడు.. ఇప్పుడు నెలకు రూ.5 కోట్ల సంపాదన.. ఎలా సక్సెస్ అయ్యాడంటే?

మన జీవితంలో కొంతమంది సక్సెస్ చూసిన సమయంలో ఇది కదా సక్సెస్ అంటే ఇలా మనం కూడా సక్సెస్ సాధించి ఉంటే మన కెరీర్ మరో రేంజ్ లో ఉండేది కదా అనిపిస్తూ ఉంటుంది.

కొంతమంది దగ్గర మంచి మంచి ఐడియాలు ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఆ ఐడియాలను అమలులోకి తిసుకొనిరావడానికి ఇష్టపడరు.

అయితే ఒక వ్యక్తి ఒకప్పుడు రోడ్డుపై కాగితాలు ఏరుకుని బ్రతికి ఇప్పుడు నెలకు ఏకంగా 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు యాదగిరి( Yadagiri ) కెరీర్ పరంగా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిస్తే సక్సెస్ సాధించడానికి ఈ స్థాయిలో ఇబ్బందులు పడతారా అని అనిపిస్తుంది.ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులను అనుభవించిన ఈ వ్యక్తి ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు.

ఈ వ్యక్తి పూర్తి పేరు మంగినిపల్లి యాదగిరి కాగా నిరుపేద కుటుంబంలో జన్మించాడు.ఇద్దరు తమ్ముళ్లను చదివించడం కోసం చిత్తుకాగితాలను ( Garbage Collector ) ఏరుకుని జీవనం సాగించాడు.

మెదక్ లోని( Medak ) కల్వకుంట్ల గ్రామానికి చెందిన యాదగిరి నాన్న వద్దని చెప్పినా చెత్త వ్యాపారంలోకి దిగి పుస్తకాలు సేకరించేవాడినని అన్నారు.ఆ తర్వాత గోడౌన్ అద్దెకు తీసుకుని సరుకు కొనడం మొదలుపెట్టానని చెప్పారు.సరుకు ఇచ్చిన వెంటనే డబ్బులు ఇస్తుండటంతో వ్యాపారం పెరిగిందని ఆయన అన్నారు.

Advertisement

ప్రస్తుతం నెలకు 5 కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నానని 80 మందికి ఉపాధి కల్పిస్తున్నానని యాదగిరి అన్నారు.

అంబర్ పేట్ లో మూడు గోడౌన్లు ఉన్నాయని దేశంలోని అన్ని పేపర్ మిల్లులకు( Paper Mills ) నా నుండి సరుకు వెళుతుందని ఆయన చెప్పుకొచ్చారు.కోటి రూపాయల విలువైన మిషనరీ ఉందని సొంతంగా ఏడు వాహనాలు ఉన్నాయని యాదగిరి అన్నారు.తన తమ్ముళ్లలో ఒక తమ్ముడిని యాదగిరి ప్రభుత్వ ఉద్యోగిని చేశారు.

తన సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని యాదగిరి సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు