పోలీసులు ఖబర్దార్

అక్రమ కేసులు సహించం

.:కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్( Congress President Puvvalla Durga Prasad ) హెచ్చరిక

 Police Khabardar Details, Districts News,telugu Districts News,khammam News,cong-TeluguStop.com

కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు( Illegal cases against Congress workers ) పెడితే సహించేది లేదని పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ హెచ్చరించారు.బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూసుమంచి మండలం ముత్యాల గూడెంలో అధికార పార్టీ నేతలు కావాలనే అల్లర్లు సృష్టించి పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.స్థానిక ఎమ్మెల్యే దీనిని అదుపు చేయకుండా ఇంకా ప్రోత్సాహిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని బండి పడ్డారు.

లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉండడం రాజ్యాంగ విరుద్ధమని అధికారం అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పోలీసులు జాగ్రతగా ఉండాలని హెచ్చరించారు.

కూసుమంచి మండలం ముత్యాల గూడెం గ్రామంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థలో ఉండడంతో గౌడ కులస్తులు అందరూ కలిసి గుడిని పునర్నిర్మానం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.

కుల పెద్దలు, గ్రామ సర్పంచ్ కలిసి గుడి నిర్మాణానికి సిద్ధం కాగా వారిలో 20 కుటుంబాలకు చెందిన వారు ఒక వర్గంగా ఏర్పడి మేము వేరే గుడి కట్టుకుంటామని గుడి నిర్మాణాలు చేపట్టారు.ఇదిలా ఉండగా 11వ తారీఖున సర్పంచ్ నాయకత్వంలో గౌడ కులస్తులు దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట చేసుకొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

దానికి పోటీగా మరొక వర్గం వారు నిర్మాణం పూర్తి కానప్పటికీ వారు కూడా అదే తేదీలో ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు.ఈ విషయాలను ఎప్పటికప్పుడు సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ప్రశాంత వాతావరణంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగే విధంగా చూడాలని పోలీసుల వారిని కోరినట్లు తెలిపారు.

రెండు విగ్రహాలు ఒకేసారి ఊరేగింపు రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుని దురదృష్టకర సంఘటన జరిగిందని తెలిపారు.

దీనికి కాంగ్రెస్ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేకపోయినా కావాలనే అధికార పార్టీ నాయకులు మాటలు విని పోలీసులు మా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని తెలిపారు.

ఏసీపి అత్యుత్సాహం ప్రదర్శించి కాంగ్రెస్ నాయకుల ఇంటి పైకి వెళ్లడం జరిగిందని ఆయన అన్నారు.అసలైన దోసులను వదిలిపెట్టి కాంగ్రెస్ నాయకులను వేధించడం సరైంది కాదని ఇప్పటికైనా పోలీసులు దీనిపై పూర్తి విచారణ చేపట్టి కారకులను శిక్షించాలని అన్నారు.

అనంతరం పాలేరు నియోజకవర్గ పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ… పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని అధికార పార్టీ నేతల చేతుల్లో కీలు బొమ్మలా మరారారని అన్నారు.ముత్యాల గూడెం లో జరిగిన సంఘటనకు బీఆర్ఎస్ నేతలే ప్రధాన సుత్రదారులని వారిని పక్కన పెట్టీ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు.

నియోజక వర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు.దీనిని కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని,భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube