బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు ‘వై’ ప్లస్ భద్రత

బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఇవాళ్టి నుంచి తెలంగాణ ప్రభుత్వం ‘వై’ ప్లస్ భద్రత కల్పిస్తుంది.

ఈ మేరకు భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో భాగంగా ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది రక్షణ కల్పించనున్నారు.మూడు షిప్ట్ లలో ఈటలకు రక్షణగా భద్రతా సిబ్బంది ఉండనున్నారు.

'Y' Plus Security For BJP MLA Etala-బీజేపీ ఎమ్మెల్య�

కాగా ఇవాళ్టి నుంచి సెక్యూరిటీ సిబ్బంది విధులను నిర్వహించనున్నారు.అదేవిధంగా ఈటల నివాసంతో పాటు కార్యాలయాల వద్ద కూడా భద్రతను పెంచారు.

ఇటీవల ఈటల రాజేందర్ తనకు ప్రాణహాని ఉందని ఆరోపించడంతో సమీక్ష నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం భద్రతను పెంచింది.ఈ క్రమంలోనే ‘వై’ ప్లస్ భద్రతను కల్పించింది.

Advertisement
మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?

తాజా వార్తలు