పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఎంత దారుణంగా వుందో చెప్పాల్సిన పనిలేదు.అక్కడ చదువుకున్న యువత నేడు ఉపాధి కోసం విదేశాలకు వలసపోయే పరిస్థితి.మరోవైపు భారతీయులు కూడా మెరుగైన జీవనశైలి, మరింత నాణ్యత గల ఉన్నత విద్య కోసం భారతదేశం నుంచి అమెరికా, ఐరోపా తదితర పారిశ్రామిక దేశాలకు వెళుతున్నారు.1971లో బంగ్లాదేశ్( Bangladesh ) అవతరణకు దారితీసిన భారత-పాకిస్తాన్( India-Pakistan ) యుద్ధ సమయంలో పాకిస్తానీయులు ఏ స్థాయిలో విదేశాలకు తరలిపోయారో అందరికీ తెలిసినదే.2021తో పోల్చితే పాక్ నుంచి చదువుకున్నవారి వలస 189 శాతం పెరిగింది.

ఈ తరుణంలో కొన్ని దశాబ్దాలు సైనిక పాలనలో మగ్గిన దక్షిణ కొరియా గత 30 ఏళ్లలో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధించింది.రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ జపాన్ పాలనలో మగ్గిన దక్షిణ కొరియా దేశ విభజనతో దారుణంగా కుంగిపోయింది.ఈ మహాయుద్ధంలో జపాన్( Japan ) ను ఓడించిన అమెరికా దక్షిణ కొరియా ప్రగతి బాధ్యత తీసుకుందనే విషయం మీకు తెలిసే ఉంటుంది.
సైనిక నియంతల పాలనలో ఉన్న ఈ ఆసియా దేశానికి అన్ని విధాలా ఈ అగ్రరాజ్యం సాయపడిందని చెప్పుకోవచ్చు.కోట్లాది డాలర్ల ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందించింది.
అమెరికా డాలర్లు అందినా పాకిస్థాన్ కి అందినా ప్రజాస్వామ్యం, ప్రగతి విషయంలో పాక్ వెనుకబడిపోయింది.

21 శతాబ్దం ఆరంభ సమయానికి శాంసంగ్, హ్యుందయ్, ఎల్జీ, కియా, పోస్కో వంటి అనేక అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన బ్రాండ్లతో ప్రపంచీకరణలో కీలక పాత్ర పోషించే స్థాయికి దక్షిణ కొరియా చేరుకోవడం విశేషం.పాకిస్తాన్ తన భౌగోళిక స్థితిగతుల కారణంగా మొదటి నుంచీ పాశ్చాత్య దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం పొందినప్పటికీ అభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడిపోయింది.పాక్ పాలకులు అమెరికా సాయాన్ని తమ దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకునే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు.
ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజాస్వామ్య పంథాలో పయనించిన దక్షిణ కొరియా తరహాలో పాకిస్తాన్ ను అక్కడి పాలకులు నడిపించలేకపోవడం పాక్ ప్రజల దురదృష్టం.అదే నేడు పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితికి కారణం అయింది.
కాగా ఇదే సమయంలో దక్షిణ కొరియా ఆర్థికరంగంలో వినూత్న విజయాలు సాధించింది.టెక్నాలజీ రంగంలో కొత్తపుంతలు తొక్కింది.
ఏభయి సంవత్సరాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయడం ద్వారా దేశంలో పారిశ్రామికీకరణకు మార్గం సుగమం చేసింది దక్షిణ కొరియా.