అరికెల ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే..తిన‌కుండా ఉండ‌లేరు!

అరికెలుచిరుధాన్యాల్లో ఇవీ ఒక‌టి.

తీపి, వ‌గ‌రు, చేదు రుచులు క‌ల‌గ‌లిసి ఉండే అరికెల్లో ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా అనేక పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రికీ అరికెలు ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌నూ అందిస్తాయి.

మరి ఆల‌స్యం చేయ‌కుండా అరికెల వ‌ల్ల వ‌చ్చే ల‌భాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.అరికెల్లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.

అందు వ‌ల్ల‌, వీటిని తీసుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం ద‌రి చేర‌కుండా ఉంటుంది.మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.

Advertisement

అలాగే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు అరికెలు ఒక వ‌రం అని చెప్పుచ్చు.ఎందు కంటే, అరికెల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ ర‌క్తంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ర‌క్త హీన‌త‌ను నివారించ‌డంలోనూ అరికెలు గ్రేట్‌గా స‌హాయప‌డ‌తాయి.అరికెల‌ను రెగ్యుల‌ర్‌ను తీసుకుంటే ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది.అదే స‌మ‌యంలో ర‌క్త శుద్ధి కూడా జ‌రుగుతుంది.

ఊబకాయంతో బాధ పడే వారు వీటిని అన్నంలా వండుకుని తినడం వల్ల శ‌రీరంలో క్ర‌మంగా కొవ్వు క‌రుగుతుంది.నిద్ర లేమికి చెక్ పెట్ట‌డంలో అరికెలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అరికెల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే.మంది నిద్ర ప‌డుతుంది.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

అంతే కాదు, అరికెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఎముకలు, కండరాలు, నరాలు బలంగా మార‌తాయి.నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్య‌లు దూరం అమ‌వుతాయి.శ‌రీరానికి బోలెడెంత శ‌క్తి ల‌భిస్తుంది.

Advertisement

చెడు కొలెస్ట్రాల్ క‌రుగి గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.కీళ్ల వాతం, రక్తస్రావం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

ఇక అరికెల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ కూడా బ‌ల‌ప‌డుతుంది.ఫ‌లితంగా, వైర‌స్ ఇన్ఫెక్ష‌న్లు, ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు