బాస్మ‌తి బియ్యం తిన‌డం వ‌ల్ల ఆరోగ్య ఎన్ని లాభాలో తెలుసా?

బియ్యాల్లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి.వాటిలో బాస్మ‌తి బియ్యం కూడా ఒక‌టి.

చూసేందుకు స‌న్న‌గా, పొడ‌వుగా ఉండే బాస్మ‌తి బియ్యం ఎంతో రుచిగా ఉంటుంది.

ఖ‌రీదు కూడా కాస్త ఎక్కువే.

పెళ్లిళ్లు, ఫంక్ష‌న్ల‌లో బాస్మ‌తి బియంతోనే జీరా రైస్, కిచిడీ, ఫలావ్, బిర్యానీ వంటివి చేస్తుంటారు.అయితే బాస్మ‌తి బియ్యం రుచిగా ఉండ‌ట‌మే కాదు.

ఎన్నో పోష‌క విలువ‌లను సైతం క‌లిగి ఉంటుంది.అందుకే మామూలు బియ్యంతో పోలిస్తే బాస్మ‌తి బియ్య‌మే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది.

Advertisement
Wonderful Health Benefits Of Basmati Rice! Health, Benefits Of Basmati Rice, Bas

మ‌రి లేటెందుకు బాస్మ‌తి బియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.బ‌రువు త‌గ్గాల‌ని కోరుకునే వారు మామూలు బియ్యం కంటే బాస్మ‌తి బియ్యం తిన‌డం ఎంతో మంచిది.

బాస్మ‌తి బియ్యం తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎటువంటి కొవ్వూ చేర‌దు.మ‌రియు వేగంగా వెయిట్ లాస్ అవుతాయి.

అలాగే గ్యాస్, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే వారికి బాస్మ‌తి బియ్యాన్ని తీసుకోవ‌డ‌మే మేలు.ఎందు కంటే, బాస్మ‌తి బియ్యం త్వ‌ర‌గా జీర్ణం అయిపోతుంది.

దాంతో జీర్ణ వ్య‌వ‌స్థ‌పై భారం త‌గ్గుతుంది.ఫ‌లితంగా జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అధిక ర‌క్త పోటును త‌గ్గించ‌డంలోనూ బాస్మ‌తి బియ్యం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.త‌ర‌చూ బాస్మ‌తి బియ్యాన్ని తీసుకుంటూ ఉంటే.

Advertisement

ర‌క్త పోటు స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.

బాస్మ‌తి బియ్యంతో థియామిన్ అనే విట‌మిన్ ఉంటుంది.ఇది మెద‌డు ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలో సూప‌ర్‌గా స‌మాయ‌ప‌డుతుంది.అందు వ‌ల్ల వారంలో రెండు లేదా మూడు సార్లు బాస్మతి బియ్యం తింటే మెద‌డు చురుగ్గా మారుతుంది.

జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.మ‌రియు మ‌తి మ‌ర‌పు కూడా ద‌రి చేకుండా ఉంటుంది.

ఇక బాస్మ‌తి బియ్యాన్ని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి ఉంటాయి.

మ‌రియు శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.

" autoplay>

తాజా వార్తలు