కొబ్బ‌రి నీళ్లు తాగ‌డానికే కాదు..ఇలా కూడా వాడొచ్చ‌ట‌!

వేస‌వి కాలం ప్రారంభం అయింది.మెల్ల మెల్ల‌గా ఎండ‌లు ముదిరిపోతున్నాయి.

అయితే ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఎక్కువ‌గా తాగే పానియాల్లో కొబ్బ‌రి నీళ్లు ఒక‌టి.

భానుడి తాపాన్ని తీర్చుకునేందుకు మ‌రియు ఆరోగ్యానికి కాపాడుకునేందుకు ఎక్కువ శాతం మంది కొబ్బ‌రి నీరు ఎంచుకుంటారు.అయితే కొబ్బ‌రి నీరు ఆరోగ్యానికే కాదు.

Beauty, Benefits With Coconut Water, Coconut Water, Benefits Of Coconut Water,

చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా జిడ్డు చ‌ర్మానికి చెక్ పెట్ట‌డంలో, మొటిమ‌లు దూరం చేయ‌డంలో, చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చ‌డంలో కొబ్బ‌రి నీరు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి కొబ్బ‌రి నీరును ఎలా యూజ్ చేయాలో చూసేయండి.జిడ్డు చ‌ర్మంతో ఇబ్బంది ప‌డే వారు.

Advertisement

కొబ్బ‌రి నీటిలో దూదుని ముంచి ముఖంపై అద్దుకోవాలి.పావు గంట పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల‌.

ముఖంపై పేరుకుపోయిన అధిక జిడ్డు తొల‌గిపోయి.ముఖం ఫ్రెష్‌గా, కాంతివంతంగా మారుతుంది.

అలాగే ఒక బౌల్‌లో కొబ్బ‌రి నీరు, ముల్తానీ మ‌ట్టి, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసుకుని.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇరవై నిమిషాలు పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే.సన్‌ట్యాన్ స‌మ‌స్య దూరం అవుతుంది.

మ‌రియు ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు ఏమైనా ఉన్నా త‌గ్గిపోయి.చ‌ర్మం తెల్లగా మారుతుంది.

ఇక మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారికి కూడా కొబ్బ‌రి నీరు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకుని.

అందులో కొబ్బ‌రి నీరు, నిమ్మ‌ర‌సం వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి దూదు సాయంతో అప్లై చేయాలి.

ప‌ది నిమిషాల పాటు ఆర‌నిచ్చి.అనంతం వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే.క్ర‌మంగా మొటిమ‌ల స‌మ‌స్య దూరం అవుతుంది.

తాజా వార్తలు