చేతులు లేకపోయినా పైలట్ గా విజయం సాధించిన యువతి.. వైకల్యం అంటే అసమర్థత కాదంటూ?

ప్రతి మనిషి లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో కష్టపడాలి.రేయింబవళ్లు కష్టపడితే మాత్రం సులువుగా లక్ష్యం సాధించడంతో పాటు సక్సెస్ సొంతమవుతుంది.

కొంతమంది చిన్నచిన్న సమస్యలు ఎదురైతేనే లక్ష్యం విషయంలో వెనుకడుగు వేస్తే మరి కొందరు మాత్రం లక్ష్యాలను సాధించి కెరీర్ విషయంలో సక్సెస్ అవుతున్నారు.అయితే జెస్సికా కాక్స్( Jessica Cox ) అనే యువతి మాత్రం పుట్టకతోనే లోపంతో పుట్టినా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు.

శరీరంలో ఏదైనా లోపం ఉంటే సక్సెస్ సాధించడం కష్టం అవుతుంది.అయితే జెస్సికా కాక్స్ అనే యువతి మాత్రం లోపాన్ని కూడా వరంగా మార్చుకున్నారు.1983 సంవత్సరంలో అరిజోనాలోని సియెర్రా విస్టాలో జెస్సికా కాక్స్ జన్మించారు.పుట్టుకతోనే జెస్సికా రెండు చేతులను కోల్పోయారు.

కూతురు రెండు చేతులు లేకుండా పుట్టినా తల్లీదండ్రులు మాత్రం ఆమెకు సపోర్ట్ గా నిలిచారు.

Advertisement

తల్లీదండ్రుల సపోర్ట్ ఉండటం వల్ల జెస్సికా కాళ్లనే చేతులుగా మార్చుకుని కెరీర్ పరంగా ముందడుగులు వేశారు.ఆ తర్వాత రోజుల్లో జెస్సికా కృత్తిమ చేతులను ధరించారు.సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన జెస్సికా 22 సంవత్సరాల వయస్సులో పైలెట్ గా శిక్షణ పొందారు.

పైలట్ గా సర్టిఫికెట్ పొందడంతో పాటు పదివేల అడుగుల ఎత్తులో తేలికపాటి క్రీడా విమానం నడిపే అవకాశాన్ని పొందారు.

తను కన్న కలలను సులువుగా జెస్సికా నెరవేర్చుకున్నారు.అమెరికన్ టైక్వాండో అసోసియేషన్ ( American Taekwondo Association )లో బ్లాక్ బెల్ట్ సాధించిన చేతులు లేని తొలి వ్యక్తిగా ఆమె వార్తల్లో నిలిచారు.జెస్సికా కాక్స్ సాధించిన విజయాలు, పురస్కారాలు అన్నీఇన్నీ కావు.

జెస్సికా కాక్స్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.వైకల్యం అంటే అసమర్థత కాదని ఆమె ప్రువ్ చేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కష్టపడితే కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో విజయాలు సొంతమవుతాయని ఆమె చెప్పకనే చెప్పేశారు.

Advertisement

తాజా వార్తలు