నాడు తెలంగాణ కోసం ఉద్యమం నేడు ఇంటి కోసం భిక్షాటన...!

సూర్యాపేట జిల్లా:నాడు తెలంగాణ కోసం పోరాడి నేడు సొంత ఇంటి నిర్మాణ కోసం గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు చేసుకున్నా ఇల్లు మంజూరు కాకపోవడంతోసొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం తన స్వగ్రామం మరియు నేరేడుచర్ల పట్టణంలో వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తూ కనిపించాడు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం జానలదిన్నె గ్రామానికి చెందిన తక్కెళ్ళ నాగార్జున( Takkella Nagarjuna ).ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాని( Gruha Lakshmi Scheme )కి అర్హుడిని కాలేదని,సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్నా, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇల్లు రాకపోవడంతో ఇలా భిక్షాటన చేస్తున్నానని చెప్పారు.

 Movement For Telangana Today Is Begging For Home , Gruha Lakshmi Scheme, Telanga-TeluguStop.com

ఇటీవల కాలంలో తనకున్న పూరిల్లు ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయిందని,గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా అర్హత ఉన్నా ఇల్లు మంజూరు కాలేదని, అర్హులైన వారికి కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ భజన చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనిఆవేదన వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ పథకాలు ఏవైనా మా పార్టీ కార్యకర్తలకే ఇస్తామని ప్రభుత్వ కార్యాలయాల్లో బహిరంగ నోటీసులు అంటిస్తే మిగతా వారు ఎవరూ ఆశపడరని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందవని తెలిసి సొంతింటి కల కోసం జానలదిన్నె గ్రామంతో పాటు నేరేడుచర్ల పట్టణంలో వీధివీధి తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఆ వచ్చిన రుణంతో ఇల్లు నిర్మించుకుంటాననిఅన్నారు.ఇప్పటికైనా హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్పందించి అర్హులైన వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube