సాధారణంగా అత్యాచారం చేశారని ఆడవారు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులు రియాక్ట్ అవుతారు.ఆడవారి చెప్పినట్లు నిందితులను అరెస్టు చేసి తమదైన శైలిలో నిజం కక్కిస్తారు.
కాగా తాజాగా ఒక మహిళ తనని గ్యాంగ్‌రేప్ చేశారంటూ ఫేక్ కంప్లైంట్ ఇచ్చింది.ఆస్తిని లాక్కోవాలనే దురుద్దేశంతో ఈ మహిళ సామూహిక అత్యాచారం అభియోగాన్ని కొందరిపై మోపింది.
ఈ విషయం ఆ తర్వాత బోధపడిన పోలీసులు ఆమెపై మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేశారు.తర్వాత శనివారం అరెస్టు చేశారు.
ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
తనను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు అత్యాచారం చేశారని, క్రూరంగా ప్రవర్తించారని ఢిల్లీలో నివసించే ఈ మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఆమెతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై కూడా ఫిర్యాదు నమోదు చేసి జైలుకు తరలించారు.
గురువారం విలేకరుల సమావేశంలో ఆ మహిళ చేసిన వాదనను “కల్పితం” అని పోలీసులు తోసిపుచ్చారు.మొదట ఆమె ఫిర్యాదు మేరకు ఐదుగురిలో నలుగురిని అరెస్టు చేశారు.
ఇప్పుడు నలుగురికి క్లీన్ చిట్ ఇస్తారా అని లేదా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతానికైతే వారు రేప్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అందువల్ల ఈ ఫేక్ రేప్ కేస్ వల్ల వారు ఎలాంటి చేసే లో ఇరుక్కుపోరని తెలుస్తోంది.
అత్యాచారం వంటి సున్నితమైన కేసుల్లో మహిళలను ఎవరూ అనుమానించారు.ఇలాంటి కేసుల్లో మహిళలే అబద్ధాలు ఆడితే అనవసరంగా అమాయకులు బలైపోతున్నారు.కాగా రీసెంట్ కేసులో అలా జరగకుండా పోలీసులు చాకచక్యంగా నిందితులను నిర్దోషులుగా తేల్చారు.
అందువల్ల చాలామంది ఆ పోలీస్ టీమ్‌ను పొగుడుతున్నారు.ఏ మహిళ అయినా సరే చట్టాలను దుర్వినియోగం చేయడం మంచిది కాదని ఇంకొందరు అంటున్నారు.