ఏపీ కాంగ్రెస్ లో కదలిక ఎప్పుడు ? కొత్త అధ్యక్షుడు ఇంకెప్పుడు ? 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై తమ శక్తికి మించి టిడిపి, జనసేన, బిజెపి పార్టీ లు  విడి విడిగా  పోరాడుతున్నాయి.లాభమో, నష్టమో, నిత్యం ఏదో ఒక అంశం తో జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి.

2024 నాటికి బలం పెంచుకుని వైసీపీని అధికారానికి దూరం చేసి,  తాము అధికారంలోకి వచ్చే విధంగా రెండు పార్టీలు విడివిడిగా పోరాటాలు చేస్తున్నాయి.అవసరమైతే ఎన్నికల సమయంలో టిడిపి జనసేన లు అధికారంలోకి రావాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.

అయితే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ గా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఏపీలో అసలు ఉందా లేదా అన్నట్లుగానే వ్యవహరిస్తోంది.        ఏ ఎన్నికలు జరిగినా, ఏపీలో ఎన్నో రాజకీయ సంచలనాలు చోటు చేసుకుంటున్న, కాంగ్రెస్ లో మాత్రం ఏ కదలిక కనిపించడం లేదు.

అసలు ఎన్నికలు జరిగినా, బలమైన అభ్యర్థులను పోటీకి పెట్టి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్న ప్రయత్నాలు ఆ పార్టీలు ఎక్కడ కనిపించడం లేదు.ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్న సాకే శైలజానాథ్ కూడా పూర్తిగా నిరాశా నిస్పృహల్లో ఉన్నారు.పార్టీ కార్యక్రమాల గురించి ఆయన పెద్దగా ఆలోచించే తీరిక లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.2024 నాటి కి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే అంశం పైన ఆయన నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్లు గా అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు నియమించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటి నుంచో ఉంది.     

Advertisement

  అసలు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని నియమించిన సమయంలోనే ఏపీ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసి, కొత్త కమిటీ ఏర్పాటుతో పాటు, కొత్త అధ్యక్షుడిని నియమిస్తారు  అనే ప్రచారం జరిగింది.కానీ ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సైలెంట్ అయిపోయింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశ్ కు  చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు అనే ప్రచారం కాంగ్రెస్ లో జరుగుతున్నా , అసలు ఏపీ కాంగ్రెస్ ను ఒక గాడి లో పెట్టాలి అనే ఆలోచన ఏదీ ఆ పార్టీ అధిష్టానం లో ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు.

ఆ విధంగా అధిష్టానమే చేతులెత్తేయడంతోనే కాంగ్రెస్ కేడర్ కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

Advertisement

తాజా వార్తలు