డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది.ఈ మేరకు డిసెంబర్ 4వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది.

ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2 అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ సమావేశం జరగనుంది.

Winter Session Of Parliament From December 4..!!-డిసెంబర్ 4 న�

ఈ మేరకు అన్ని పార్టీలకు పార్లమెంటరీ శాఖ లేఖలు రాసింది.అదేవిధంగా పార్లమెంటరీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా నేతలకు వ్యక్తిగత లేఖలు పంపనున్నారు.

మొత్తం 19 రోజుల పాటు సాగే ఈ సమావేశాలు డిసెంబర్ 22 తో ముగియనున్నాయి.కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!

తాజా వార్తలు