వైరల్ వీడియో: అయ్య బాబోయ్.. ఎర్ర చీమలతో చట్నీ.. మీరు ట్రై చేస్తారా..?

మన భారత దేశంలో వివిధ రకాల చట్నీలను తయారు చేస్తూ ఉండడం చూసే ఉంటాం.కొంతమందికి చట్నీ లేనిదే అన్నం కూడా తినరు.

ఇక మన భారతదేశంలో చాలా వరకు ఎండాకాలం వచ్చింది అంటే చాలు పలు రకాల చట్నీలు తయారు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. మామిడికాయ చట్నీ, ఉసిరికాయ చట్నీ, టమాటో చట్నీ ఇలా పలు రకాల చట్నీలను ఆడవారు పెడుతూ ఉంటారు.

ఇలా భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన చట్నీకి ప్రసిద్ధి ఉంటుంది.ఇలా ప్రసిద్ధి చెందిన చట్నీలలో రెడ్ యాంట్ చెట్నీ కూడా ఒక ప్రసిద్ధికరమైనది.

ఇక దీని తయారీ విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.ఈ రెడ్ యాంట్ చట్నీని( Ant chutney ) ఎక్కువగా ఒడిస్సా, ఛత్తీస్గడ్ ప్రాంతాలలో తయారు చేస్తూ ఉంటారు.ఇందుకు సంబంధించి తాజాగా ఈ చెట్నిని తయారు చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా మనం ఎర్ర చీమల చట్నీని ( Red ant chutney )దశలవారీగా తయారు చేయడం మనం చూడవచ్చు.ముందుగా అన్నిటిలలో ముఖ్యమైనది.

చెట్టు నుండి ఎర్రటి చీమలను తీసుకొని రావడం అతి పెద్ద పనే అని చెప్పాలి.చీమలు వాటి గుడ్లను ఒక కంటైనర్ లో సేకరించి వాటిని క్రమబద్ధీకరించే విధానం వివరించే వీడియోలో ఒక మహిళ వాటిని సజీవంగా ఉండగానే తినడం మనం చూడవచ్చు.

ఇక చీమల అన్నీ సేకరించిన అనంతరం చట్నీ కోసం పదార్థాలును ఎండు మిరపకాయ, వెల్లుల్లి, తగినంత ఉల్లిపాయలను రెడీ చేసి పెట్టుకుంది.ముందుగా ఎండు మిరపకాయ, వెల్లుల్లి, ఉల్లిపాయలను అన్ని మిశ్రమంలో చీమలు వాటి గుడ్లను కలపడం మనం చూడవచ్చు.అనంతరం ఆ చెట్ని రుచి కూడా చూసింది ఆ మహిళ.

అయితే సాధారణంగా ఆ ప్రాంతంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా ఈ చట్నని స్వీకరిస్తారట.జ్వరంతో బాధపడే వారికి ఈ చట్నీ చాలా మంచిదని అక్కడి వారి అభిప్రాయం.

తెలుగు లో ఈ ఇద్దరు దర్శకులకు మాత్రమే 100% సక్సెస్ రేట్ ఉందా..?
వైరల్: కారులేంటబ్బా ఇలా కడుపు వచ్చిన దానివలె మారుతున్నాయి..

ఇక ఈ చట్నీ కోసం ఉపయోగించే చీమలు మయూర్‌భంజ్ అడవిలో దొరుకుతాయట.ఇక ఈ రెడ్ యాంట్ చట్నీ మేకింగ్ వీడియో ఇప్పుడు నెత్తిన వైరల్ అవుతుంది.

Advertisement

ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.

తాజా వార్తలు