ఎంఎస్ఎన్ కెమికల్ కంపెనీ పొల్యూషన్ కు విముక్తి ఎప్పుడో...?

యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ మండల పట్టణంలో ఎంఎస్ఎన్ కెమికల్ కంపెనీ పొల్యూషన్ నుండి విముక్తి ఎప్పుడని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కెమికల్ పొగ,దుర్వాసనతో చుట్టుపక్కనున్న ఇండ్లలో ఉండలేని పరిస్థితి ఉందని,ఈ కంపెనీ వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పాడైపోయి ఎరుపు రంగులో వస్తున్నాయని, నీళ్లను కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని, పొగతో శ్వాస ఆడక చిన్న పిల్లలు,సీనియర్ సిటిజన్లు అవస్థలు పడతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కంపెనీ బీబీనగర్ నుండి ఎత్తి వేయాలని బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు సురకంటి జంగారెడ్డి డిమాండ్ చేశారు.లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

మల్కపేట రిజర్వాయర్ ను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు..

Latest Yadadri Bhuvanagiri News