ఇక బిడ్డలు మెషీన్ల ద్వారా పుడతారా.. వైరల్ వీడియో!

సోషల్ మీడియా అనేది నేడు ఏరకంగా ప్రజలను ప్రభావితం చేస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

ఈ క్రమంలో అనేక రకాల వీడియోలు నిత్యం ఇక్కడ వైరల్ అవుతూ ఉంటాయి.

అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని అద్భుతంగా అనిపిస్తాయి.ఇంకొన్ని మైమరిపించేలా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి.

అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీకు ఆశ్చర్యంతో పాటు అద్భుతంగా అనిపించక మానదు.ఇక తల్లి కావడం అనేది ప్రతి మహిళకు గొప్ప వరం అని చెప్పుకోవాలి.

నవమాసాలు బిడ్డను మోసి కనడం మహిళలకు మాత్రమే దక్కిన ఓ అపూర్వమైన గొప్ప అనుభూతి అని చెప్పుకోవాలి.గర్భస్థ శిశువుని 9 నెలల పాటు మోసి, భరించలేని నొప్పిని పంటి బిగువన భరించి బిడ్డకు జన్మనివ్వడం అనేది పూర్వజన్మ సుకృతం.

Advertisement

అయితే బిడ్డకు జన్మనివ్వడం అనేది నేటి దైనందిత జీవితంలో జన్మనివ్వడం అనేది కొంతమందికి కష్టం అవుతోంది.దీనికి అనేక కారణాలు.

ఈ క్రమంలోనే సరోగసి (అద్దెగర్భం), IVF లాంటివి పుట్టుకొచ్చాయి.

ఈ నేపథ్యంలోనే గర్భం అవసరం లేకుండా బిడ్డలకు జన్మనిచ్చే కొత్త టెక్నాలజీ ఒకటి రానుందని ఇంటర్నెట్‌లో ఓ వీడియో తెగ హల్‌చల్‌ చేస్తోంది.అవును, యంత్రాల ద్వారా బిడ్డకు జన్మనివ్వడం అనేది మానవుని మేధస్సుకి తార్కాణం.దీనిని ఎక్టో లైఫ్ అనే సంస్థ ఆర్టిఫిషియల్ యుటెరస్ ఫెసిలిటీని తీసుకువచ్చింది.

ఇది ప్రపంచంలోనే తొలి కృత్రిమ పిండంలా పని చేస్తుందని సంస్థ చెబుతోంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యంత్రాల సాయంతో ఈ యంత్రాల్లోనే 9 నెలలు పిండాన్ని పెంచి, శిశువు బయటకు వచ్చేంత వరకు జాగ్రత్తలు తీసుకొంటామని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

కాగా ఈ విషయాన్ని నెటిజన్లు విని షాక్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు