Rana Daggubati: రానా సినిమాలను ప్రకటించకపోవడానికి అదే కారణమా.. వైరల్ అవుతున్న న్యూస్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే.

నిర్మాత సురేష్ బాబు వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి లీడర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా అనంతరం వరస సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇక ఈయన రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన రానా పలు సినిమాలలో విలన్ క్యారెక్టర్ లో కూడా నటిస్తూ సందడి చేశారు.ఈ సినిమా అనంతరం రాణా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక ఈ సినిమా తర్వాత వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా సాయి పల్లవి జంటగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన విరాటపర్వం సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది.

Advertisement
Why Rana Daggubati Not Announcing New Movies Details, , Rana Daggubati , Rana D

ఈ సినిమా విడుదలయ్యి కూడా దాదాపు కొన్ని నెలలు పూర్తి అయినప్పటికీ రానా ఇప్పటి వరకు ఎలాంటి కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు.ఈ విధంగా రానా ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో అసలు రానా సినిమాలకు ఎందుకు కమిట్ అవ్వలేదు

Why Rana Daggubati Not Announcing New Movies Details, , Rana Daggubati , Rana D

ఎందుకు ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారనే విషయం గురించి పెద్ద ఎత్తున అభిమానులు, నేటిజన్స్ ఆరా తీస్తున్నారు.అయితే రానా విరాటపర్వం సినిమా కమిట్ అయిన తర్వాత ఏ సినిమా కథలను వినడానికి కూడా ఆసక్తి చూపించడం లేదని సమాచారం.అయితే ఇలా రానా సినిమాలకు దూరం కావడానికి గల కారణం కేవలం ఆయన ఆరోగ్య సమస్యలే కారణమని తెలుస్తుంది.

బాహుబలి సినిమా తర్వాత రానా అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారని,ఇలా అనారోగ్య సమస్యల కారణంగానే రానా ఎలాంటి సినిమాలను ప్రకటించలేదని తెలుస్తోంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై రానా స్పందించాల్సి ఉంది.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు