కార్తీక దీపం కొత్త వేరియంట్.. సామాన్యుడి ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా ?

కార్తీకదీపం సీరియల్ ముగిసిపోయింది.చాలామంది తలంటు స్నానాలు చేసి హమ్మయ్య బ్రతికేసాం అనుకున్నారు.

కానీ కరోనా కు కొత్త వెరియెంట్ వచ్చినట్టు ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కి కూడా ఆ కొత్త వేరియంట్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు.ఎందుకు తీస్తున్నాము ? చూసేవారు ఎందుకు చూస్తున్నారు ? అర్థం కాని గందర గోళం లో సీరియల్ నీ పడేసి, టిఆర్పి రేటింగ్స్ డౌన్ అయ్యి, ఎలా నడిపించాలో తెలియక.ముగించే పరిస్థితి వచ్చి చరమ గీతమైతే పాడేశాం కానీ మళ్ళీ దీనికి సీక్వెన్స్ రాబోతుంది అనే విషయం తెలిసి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు జనాలు.

పైగా కార్తీక దీపం ఎండింగ్ ఎపిసోడ్ కూడా గందర గోళంగా మారింది.ఈ సీరియల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రేక్షకులకు కొన్ని డౌట్స్ పెడుతూ ముగింపు పలికాడు దర్శకుడు.

అవేంటో ఒకసారి చూద్దాం.ముఖ్యంగా సీరియల్లో హిమ పాత్రపై శౌర్యకి చాలా కోపం వస్తుంది.మరి ఆ కోపం పోయిందా ? పోతే ఆ కోపం పోవడానికి గల కారణాలు ఏంటి చూపించలేదు.పైగా కథను మరోక జనరేషన్ కి మూవ్ చేసి గడియారంలో ముల్లుని కదా వెనక్కి తిప్పినట్టు తిప్పేశారు.

Advertisement

మరి వాళ్ళ రీఎంట్రీ లేకుండా ముగింపు ఎలా ఇచ్చారో చెప్పలేదు.అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య దీప బతికిందా లేదా చివరి వరకు ఏం జరిగిందో చూపించలేదు.హిమా, ప్రేమ్ అలాగే నిరూపం, సౌర్యల పెళ్లిలు జరిగాయా జరగలేదా అని గందరగోళం కూడా మిగిలిపోయింది.

ఈ సీరియల్ లో చారు శీల అనే ఒక పాత్ర ఉంటుంది.ఆమె ఏమైంది ? చారు శీల వల్లే దీప అనారోగ్యానికి గురైంది అనే విషయం పండరి తెలుసుకుందా లేదా అని కూడా క్లారిటీ లేదు.

ఇక అప్పుడప్పుడు కనిపిస్తూ కొన్నిసార్లు కనిపించకుండా పోయే దుర్గ ఎక్కడున్నాడు ? జైల్లోనే మిగిలిపోయాడా? అనే విషయంలో స్పష్టత లేదు.ముసలి పాత్రలోకి మారినట్టు కనిపించే సౌందర్య పాత్ర అర్దం ఏమిటి ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలి అంటే సీక్వల్ తీస్తే తప్ప సాధ్యం కాదు అది జనాల మీదికి వదిలేస్తే తప్ప దర్శకుడికి నిద్ర పట్టదు.చూడాలి.

సీరియల్ కథలకు సీక్రెన్సెస్ అనేది కొత్తయి అయినా భవిష్యత్తు మనం ఊహించలేం కదా !.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు