యోగులూ సన్యాసులూ కాషాయం ఎందుకు ధరిస్తారు?

ప్రస్తుత కాలంలో కాషాయం రంగు ఒక రాజకీయ గుర్తుగా మిగిలిపోయింది.కాషాయం అనేది హిందూ మతాన్ని మాత్రమే సూచిస్తుందా? ఇన్ని వేల రంగులు ఉండగా హిందూ మతానికి చెందిన యోగులు, సన్యాసులూ కాషాయం రంగునే ఎందుకు ధరిస్తారు?

కాషాయం రంగు సూర్య తేజానికి గుర్తు.

సూర్యుడు జ్ఞానానికీ, చైతన్యానికీ ప్రతీక.నిద్రాణమై నిర్వీర్యంగా, నిస్సత్తువగా ఉన్న జాతిని మేల్కొల్పడానికి జ్ఞాన సూర్యులై వెలుగొందుతారు ఋషులు.

సూర్యుని వెలుతురుకి పేద, ధనిక అనే భేదాలు ఉండవు.అందరినీ సమానంగా చూసే గుణాన్ని కాషాయం సూచిస్తుంది.

అందుకే ఋషులు, యోగులు సన్యాసులు కషాయాన్ని ధరిస్తారు.

కాషాయం అగ్నికి ప్రతీక.తమ అహాన్నీ, కామ క్రోధాది అరిషడ్వర్గాలనీ దహించివేసే అగ్ని కాషాయం.వారు అరిషడ్వర్గాలనూ, కుల, మత, పేద,ధనిక భేదాలనూ, అన్ని రకాల కట్టుబాట్లనూ జ్ఞానమనే దివ్యాగ్నిలో ఆహుతి చేసి సర్వసంగ పరిత్యాగులౌతారు.

కనుకనే యోగులు సన్యాసులు కాషాయం రంగును ధరిస్తారు.హిందూ మత వ్యతిరేకంగా ఉద్భవించిన బౌద్ధ జైన మతాలు కూడా కాషాయం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించి హిందూ మతాన్ని అనుసరిస్తున్నాయి.

Advertisement
Why Do Yogi’s And Munis Wear Saffron?-Why Do Yogi#8217;s And Munis Wear
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!
Why Do Yogi#8217;s And Munis Wear Saffron

తాజా వార్తలు

Why Do Yogi#8217;s And Munis Wear Saffron