సంపత్ నంది ఎందుకు పెద్ద డైరెక్టర్ అవ్వలేదు అంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో తనదైన శైలి లో సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు.

అలాంటి వాళ్ళలో సంపత్ నంది( Sampath Nandi ) ఒకరు.

ఈయన ఏమైంది ఈవేళ అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రచ్చ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది.

ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

దాంతో పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేయాల్సి ఉండగా,దానికి మధ్యలోనే అది బ్రేక్ పడింది ఇక ఈయన ప్లేస్ లోకి అప్పుడు డైరెక్టర్ బాబి వచ్చాడు.దాంతో సంపత్ నంది రవితేజ తో బెంగాల్ టైగర్ సినిమా చేశాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇక ఆ సినిమా తర్వాత గోపీచంద్ హీరో గా గౌతమ్ నంద( Goutham Nanda ) అనే సినిమా చేశారు.ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయల్ పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమా లో హీరో అతనే, విలను ఆయనే కాబట్టి గోపిచంద్ ఫ్యాన్స్ ని ఈ సినిమా కొంతవరకు నిరాశపరిచింది.ఈ సినిమా చూడ్డానికి బాగున్నప్పటికీ అప్పుడు ఉన్న ప్రేక్షకుల మెంటాలిటీకి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయలేదు.

అందుకే ఈ సినిమాని ఆడియెన్స్ ఫెయిల్ చేశారనే చెప్పాలి.

గోపీచంద్, సంపత్ నంది కాంబోలో ఆ తర్వాత కూడా సిటిమార్( Seetimaarr అనే సినిమా వచ్చింది ఈ సినిమా కూడా యావరేజ్ విజయాన్ని అందుకుంది.దీంతో సంపత్ నందికి అవకాశాలు ఇచ్చే హీరోలు కరువయ్యారు.ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకుంటే తనకి పెద్ద హీరోల నుంచి కూడా అవకాశం వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకోవాలి లేకపోతే సంపత్ నంది ఇండస్ట్రీలో ఆయన కెరియర్ ఫేడ్ అవుట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

Advertisement

అయితే ఈయన బ్యాక్ టు బ్యాక్ పెద్ద హిట్లు కొట్టకపోవడం తో ఈయన ఇండస్ట్రీ లో పెద్ద డైరెక్టర్ గా ఎదగ లేకపోయాడు.

తాజా వార్తలు