రాజన్న సిరిసిల్ల జిల్లా: కొత్తపల్లి – మనోహరాబాద్ కు సంబంధించిన రైల్వే లైన్ పెండింగ్ భూ సేకరణ ప్రక్రియను జిల్లాలో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కేంద్ర అధికారులకు తెలిపారు.సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ సమన్వయ కార్యదర్శి విజయ్ తివాన్ దేశంలోని అన్ని జిల్లాలో పురోగతిలో ఉన్న రోడ్లు, రైల్వే లైన్ ల భూ సేకరణ, తదితర అంశాలపై ఢిల్లీ నుండి సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయం నుండి ఈ విడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
కొత్తపల్లి – మనోహరాబాద్ కు సంబంధించిన రైల్వే లైన్ భూ సేకరణకు సంబంధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగి తెలుసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సుమారు 954 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 808 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని జిల్లా కలెక్టర్ అధికారులకు వివరించారు.దీనిని రైల్వే శాఖకు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు.
పెండింగ్ లో ఉన్న 144 ఎకరాల భూ సేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.దృశ్య మాధ్యమ సమీక్ష లో ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయం నుండి ఆర్డీఓ ఆనంద్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్ రావు, పర్యవేక్షకులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.