Big Boss 7: ఆబ్బె మేము రాలేము అండి..మొహం మీదే చెప్పేస్తున్నా సెలబ్రిటీలు

బిగ్ బాస్ షో( Bigg Boss Show ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

మాటీవీలో వచ్చే ఈ షో ప్రతి సీజన్ భారీ అంచనాలతో వస్తుంది.

ఈ షోకి నాగార్జున హోస్టింగ్ చేసే విషయం అందరికి తెలిసిందే.అయితే మధ్యలో నాని, ఎన్టిఆర్ కూడా హోస్టింగ్ చేసి అదరగొట్టారు.

అయితే గత 2 - 3 ఏళ్ళ నుంచి బిగ్ బాస్ చూసే వారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి.క్రియేటివిటీ తగ్గడం, అనవసరమైన గొడవలతో, గట్టి కంటెస్టెంట్ లు లేకపోవడంతో ఇంట్రెస్ట్ తగ్గింది.

ఇప్పుడు మరో సీజన్ కు బిగ్ బాస్ రెడీ అవుతుంది.

Why Celebrities Are Not Interested In Bigg Boss 7 Telugu
Advertisement
Why Celebrities Are Not Interested In Bigg Boss 7 Telugu-Big Boss 7: ఆబ్�

గత కొన్ని రోజుల నుంచి ప్రోమోలు కూడా వస్తున్నాయి.ఈ సీజన్ లో కూడా హోస్టింగ్ నాగార్జున ( Nagarjuna )చేస్తున్నారనే వార్త ఫైనల్ కూడా అయిపోయింది.కానీ ఇప్పటివరకు అసలు ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది, ఈసారి కంటెస్టెంట్ లుగా ఎవరు వస్తారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే ఇప్పటికే కొన్ని చానెల్స్ లో కొంత మంది పేర్లు వైరల్ అవుతున్నాయి.

Why Celebrities Are Not Interested In Bigg Boss 7 Telugu

గత ఏడాది కంటే ఈసారి ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ లని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయట.బిగ్ బాస్ లోకి రావాలంటే చాలా లెక్కలుంటాయి.

స్క్రిప్టెడ్ వర్క్, టాస్కులు, వోటింగ్, వారానికి ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ముందే ప్లాన్ చేసుకుంటారు.అయితే కొన్ని సైట్స్ లో ఇప్పటికే కొందరి పేరు వినిపిస్తుంది.

Why Celebrities Are Not Interested In Bigg Boss 7 Telugu
చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈ సీజన్ లో సింగర్ మోహన భోగరాజు, టీవీ సీరియల్ నటి శోభాశెట్టి, యాంకర్ విష్ణుప్రియ, చైతన్య వైష్ణవి, టీవీ సీరియల్ నటి నవ్య, నటి సురేఖావాణి, టీవీ నటుడు ప్రభాకర్, యాంకర్ దీపిక పిల్లి, యూట్యూబ్ పాపులర్ జంట దుర్గారావు దంపతులు ఉంటారనే వార్త వైరల్ అవుతుంది.కానీ ఇంకా ఎవ్వరి పేరు కూడా కన్ఫర్మ్ కాలేదు.అయితే ఈ సీజన్ లో దుర్గారావు దంపతులకు బదులు డాన్స్ మాస్టర్ ఆట సందీప్ జంట కన్‌ఫరమ్ అయినట్టు తెలిసింది.

Advertisement

సురేఖావాణి, మోహన భోగరాజుతో సంప్రదింపులు కూడా జరిగాయని కానీ వారు ఇంకా ఏ విషయం చెప్పలేదని వార్తలు వినిపిస్తున్నాయి.ముందు వైష్ణవి చైతన్య కూడా ఈ సీజన్ లో వస్తుంది అని ఒక పుకారు ఉండేది.

అయితే ఇప్పుడు బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వైష్ణవి బిగ్ బాస్ లోకి రాకపోవచ్చు.ఈ సీజన్ లో శోభాశెట్టి, నవ్య, విష్ణుప్రియ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు.

చూడాలి మరి.ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరు వస్తారో అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు