విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఎవరు బలి కావాలి...?

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రామపురం గ్రామ శివారులోని అప్పయ్య అనే రైతు పొలంలో రెండు రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాల వైర్లు తెగి పొలాల్లో పడ్డాయి.

దీనితో రైతులు పొలాల దగ్గరకు వెళ్ళాకంటే భయ పడుతున్నామని,మరో వైపు విద్యుత్ సరఫరా లేక మోటర్లు నడవక వరి పొలలు ఏండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గాలి వానకు తెగిపడ్డ విద్యుత్ వైర్లను రెండు రోజులైనా పునరుద్ధరించకుండా సంబంధిత లైన్మెన్, విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవులు,మనుషుల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని,ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులని వాపోయారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్తంభాలపై వైర్లు అమర్చాలని కోరారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!
Advertisement

Latest Suryapet News