Jailer Villain Vinayakan: జైలర్ సినిమాలో హీరో కంటే ఎక్కువగా పాపులర్ అయిన విలన్.. అసలు ఎవరు ఇతను..

రజినీకాంత్( Rajinikanth ) హీరోగా కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన జైలర్ సినిమా( Jailer Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన వినాయకన్( Vinayakan ) ప్రస్తుతం బాగా హైలైట్ అవుతున్నాడు.

అతని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని అభిమానులు ఇంటర్నెట్ మొత్తం వెతికేస్తున్నారు.మరి అతని గురించి మనమూ తెలుసుకుందామా.

వినాయకన్ మలయాళ నటుడు, సింగర్, కంపోజర్. అతను 1995 నుంచి మలయాళ సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు.2006 నాటి తెలుగు సినిమా అసాధ్యుడులో కూడా నటించాడు.అదే ఏడాది విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో( Pogaru Movie ) కూడా కనిపించాడు.

అయితే రీసెంట్ రిలజైన జైలర్ సినిమా తరువాత వినాయకన్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.అతను ఈ సినిమాలో విలన్ పాత్రను( Jailer Villain ) పోషించాడు.

Advertisement

అతని నటన ప్రశంసలు అందుకుంది.వినాయకన్ విలన్‌ పాత్ర హీరో రజినీకాంత్ పాత్రను మరింత ఎలివేట్ చేసింది.

సినిమాకు విజయాన్ని అందించింది.వినాయకన్ ఒక క్రూరమైన, భయంకరమైన వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించాడు.

నిజానకి ఈ నటుడి ఫేస్ చాలా రఫ్ గా ఉంటుంది.అతని భీకరమైన చూపులు భయపెడుతుంటాయి.

భయంకరమైన ఆకారానికి తగినట్లుగా సినిమాల్లో ఈ నటుడు హింసను ఆనందిస్తాడు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

అతని అనుచరులను భయపెట్టడానికి, నియంత్రించడానికి తన రూపాన్ని ఉపయోగిస్తాడు.వినాయకన్ యొక్క విలన్‌ పాత్ర ప్రేక్షకులను భయపెట్టింది.సినిమాకు ఒక కీలక పాత్రగా మారింది.

Advertisement

వినాయకన్ డ్యాన్సర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు.ఫైర్ డ్యాన్స్‌తో బ్లాక్ మెర్క్యురీ( Black Mercury ) అనే గ్రూప్ నిర్వహించేవాడు.

దర్శకుడు తంపి కన్నంతనం అతన్ని మాంత్రికంలో, తరువాత ఓనమన్‌లో పరిచయం చేశారు.స్టాప్ వయలెన్స్, వెల్లితీర, చతికథా చంతు, ఛోట్టా ముంబై, తొట్టప్పన్ చిత్రాలలో అతను గొప్పగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అలాగే, అతను జేమ్స్( James ) అనే బాలీవుడ్ సినిమాలోనూ కనిపించాడు.

వినాయకన్ సొంతంగా నటన నేర్చుకున్న నటుడు, డ్యాన్సర్.ఈ యాక్టర్ ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడా.కండలు తిరిగిన శరీరంతో భయంకరమైన రూపంతో ఎప్పుడూ బెస్ట్ విలన్‌గా కనిపిస్తుంటాడు.

ఇకపోతే తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమైన జైలర్‌ను నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilip Kumar ) రచించి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో తమన్నా, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, సునీల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ మూవీ ఒక జైలు సూపరింటెండెంట్ గురించి, అతను మాఫియా యొక్క దాడుల నుంచి తన కుటుంబాన్ని రక్షించడానికి పోరాడుతాడు.

తాజా వార్తలు