ఓంకార్ డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమా హీరో ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో చాలామంది యంగ్ హీరోలు( Young heroes ) మంచి కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాలు విజయవంతం అయ్యేలా చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన హీరోలలో అశ్విన్ బాబు ( Ashwin Babu )ఒకరు.

ఈయన ఓంకార్ తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.అదేవిధంగా ఓంకార్ తీసిన జీనియస్( Genius ) సినిమాలో సెకండ్ హీరోగా వచ్చి ఆ తర్వాత ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన రాజు గారి గది సినిమాలో మెయిన్ హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకున్నాడు.

Who Is The Hero Of The New Movie Coming In The Direction Of Omkar, Omkar , New M

ఆ తర్వాత రాజు గారి గదికి సీక్వెల్లో నటించినప్పటికీ అవి పెద్దగా విజయం సాధించలేదు దాంతో ఈమధ్య వచ్చిన హిడింబ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అయినప్పటికీ ఈయనకి పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు.దాంతో మళ్లీ ఓంకారే తన తమ్ముడైన అశ్విన్ తో ఇంకొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా మన ముందుకు వస్తున్నట్టు గా తెలుస్తుంది.

ప్రస్తుతం ఓంకార్ ఓటిటి ప్లాట్ఫారం లో కొన్ని షోలు చేస్తున్నాడు.ఇక ఇప్పుడు ఆయన మళ్ళీ సినిమా డైరెక్షన్ చేయబోతున్నాడు ఒక మంచి సినిమా చేసి మంచి విజయాన్ని అందుకోవడమే ఆయన అంతిమ లక్ష్యంగా తెలుస్తుంది.

Advertisement
Who Is The Hero Of The New Movie Coming In The Direction Of Omkar, Omkar , New M

ఇక ఇండస్ట్రీలో తను ఎదగడమే కాకుండా తన తమ్ముడైన అశ్విన్ బాబుని కూడా మంచి హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అయినప్పటికీ కొన్ని వర్కౌట్ అవుతున్నాయి.మరికొన్ని ఫెయిల్ అవుతున్నాయి ఇక ఇప్పుడు తనే స్వయంగా మళ్ళీ డైరెక్షన్ చేసి తన తమ్ముడికి ఒక హిట్టు ఇవ్వాలని చూస్తున్నాడు.

నిజానికి వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక మంచి హిట్ కొట్టి ఉన్నారు కాబట్టి వీళ్ళకి మార్కెట్ కూడా బాగానే ఉంది.దాంతో మళ్లీ ఇప్పుడు కూడా ఒక బిగ్గెస్ట్ హిట్టు కొట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు