పవన్ కళ్యాణ్ సినిమా హిట్ ప్లాప్ అనేది ఆయనకి చెప్పకుండా దాస్తుంది ఎవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )ఇక ఆయన ప్రస్తుతం అటు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే, ఇప్పుడు సినిమాలను కూడా చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు లాంటి సినిమాలను చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో వాటికోసం ఒక మూడు నెలల నుంచి సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.అయితే వఛే నెల నుంచి ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఒక స్పీచ్ లో మాట్లాడుతూ తనకు ఒక తొలిప్రేమ సినిమా( Tholi Prema ) మాత్రమే హిట్ అయినట్టుగా తన దర్శక నిర్మాతలు చెప్పారట.

మిగిలిన ఏ సినిమాలు కూడా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత తనకు ఎవరూ అది హిట్ అని ప్లాప్ అని చెప్పలేదట.

పవన్ కళ్యాణ్ కి ఎలాగూ సక్సెస్ మీట్లంటే ఇష్టం ఉండదు కాబట్టి వాటిని ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు చేసేవారు కాదు.అందువల్లే పవన్ కళ్యాణ్ కి సినిమాలు హిట్ అయ్యాయా ప్లాప్ అయ్యాయా అనే విషయాలు కూడా సరిగ్గా తెలియదు.తను మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఎమ్మెల్యే గా గెలిచాడు.అలాగే తన సినిమాలతో కూడా భారీ సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు